తొలుత అక్కడక్కడా కొన్ని సినిమాల్లో మెరిసిన వితిక షేరు, ఆ తరువాత టాలీవుడ్ నటుడు వరుణ్ సందేశ్ ని ప్రేమించి వివాహం చేసుకోవడం జరిగింది. హ్యాపీ డేస్ సినిమాతో హీరోగా పరిచయమైన వరుణ్, ఆ తరువాత కొత్త బంగారు లోకం సినిమాతో మరొక సక్సెస్ ని అందుకున్నాడు. ఇక ఆ తరువాత మాత్రం అతనికి పెద్దగా సక్సెస్ లు దక్కలేదు. ఇకపోతే ఇటీవల వివాహం చేసుకున్న వీరిద్దరూ, ఎంతో అన్యోన్యంగా జీవితం గడుపుతున్న సమయంలో, మధ్యలో హఠాత్తుగా వితిక సూసైడ్ అటెంప్ట్ చేసింది అనే వార్తలు అప్పట్లో పెను సంచలనమే రేపాయి. 

 

ఆరునెలలు అమెరికాలో ఉండి రావడం వలన తనకు ఇక్కడి వాతావరణానికి సరిగ్గా నిద్ర పట్టేది కాదని, అందువలన తాను డైలీ నిద్ర మాత్రలు వేసుకోవడం అలవాటు చేసుకున్నానని  సూసైడ్ అటెంప్ట్ అనంతరం వితిక చెప్పడం జరిగింది. అయితే ప్రతి రోజు మాదిరిగానే ఆ రోజు కూడా నిద్ర రాకపోవడంతో ఒక టాబ్లెట్ వేసుకున్నానని, అప్పటికి కూడా నిద్ర రాకపోవడం వలన మరికొన్ని మాత్రలు వేసుకోవడంతో, పొద్దున్నే నిద్ర మెలకువ త్వరగా రాలేదని, దానితో ఎంతో కంగారు పడిన మాఅమ్మ, వెనువెంటనే నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్లారు. 

 

అప్పుడు హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటో, నా ఫ్రెండ్ ద్వారా బయటకి రావడంతో అది సూసైడ్ ప్రయత్నంగా మీడియాలో ప్రచారం జరిగిందని చెప్పుకొచ్చారు వితిక. కాగా ఈ విషయమై అప్పట్లో భార్య, భర్తలిద్దరి మధ్య మనస్పర్థలు రేగాయని, అందువల్లనే వితిక సూసైడ్ అటెంప్ట్ చేసిందని వార్తలు హల్ చల్ చేసాయి. ఇక ఇటీవల బిగ్ బాస్ లో పాల్గొన్న ఈ జంటకు సంబందించి, అప్పట్లో జరిగిన ఈ ఘటన, ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: