తెలంగాణ విద్యార్థి విభాగంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమ నాయకుడిగా విప్లవ యోధుడిగా అనేక ఉద్యమాలు చేసి చరిత్రలో నిలిచి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న జార్జి రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన జార్జి రెడ్డి సినిమా ఈనెల 22వ తారీఖున విడుదల కాబోతున్న ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక విషయంలో ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని సినిమా యూనిట్ చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించగా తెలంగాణ పోలీసులు జార్జి రెడ్డి సినిమా యూనిట్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ రావడం వల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని ముఖ్యంగా నెక్లెస్ రోడ్డు ప్రాంతంలో ప్రీ రిలీజ్ వేడుక జరిగితే చాలా వివాదాలు నెలకొంటాయి అని చెప్పి సినిమా యూనిట్ కి గట్టి షాక్ ఇచ్చారు తెలంగాణ పోలీసులు.

 

ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించి ఇండస్ట్రీలో ఉన్న చాలామంది ప్రముఖులు సినిమాపై పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా సోషల్ మీడియా ద్వారా సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేశారు.స్పెషల్ షోను వీక్షించిన ఆర్జీవీ సినిమా అదిరిపోయిందని చెప్పారు. జార్జిరెడ్డి పాత్రలో నటించిన సందీప్‌ మాధవ్‌ నటనను చూశాక జార్జ్‌ రెడ్డి తిరిగి వచ్చినట్టు అనిపించిందని ప్రశంసలు అందించారు. అంతేకాకుండా సినిమా యూనిట్ మొత్తానికి అభినందనలు కూడా తెలిపారు.

 

దీంతో జార్జి రెడ్డి సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో అని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చాలా మంది యువకులు సినిమా ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోపక్క అఖిల భారత విద్యార్థి విభాగం ఏబీవీపీ ఈ సినిమాలో తమ యూనియన్ ని విలన్ గా చూపించారు అని కామెంట్ చేస్తూ సినిమా ఎట్టి పరిస్థితుల్లో విడుదల అవకుండా చూసుకుంటామని సవాలు చేస్తున్నారు. దీంతో జార్జిరెడ్డి సినిమా విడుదల అవుతుందో లేదో అన్న వార్తలు ఇప్పుడు చిత్ర యూనిట్ ని టెన్షన్ పుట్టిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: