ఖైదీ నెంబర్ 150రిలీజై 15రోజులు అయితే గానీ.. సాంగ్స్ ను వీడియో టీజర్స్ గా రిలీజ్ చేయలేదు. రిలీజ్ కు ఒకటి రెండు రోజుల ముందు ట్రైలర్స్ రిలీజ్ చేసినవాళ్లూ ఉన్నారు. ఇక్కడ అంతా గోప్యమే. అయితే.. కోలీవుడ్ లో మాత్రం బహిరంగమే. రిలీజ్ కు ముందు.. సినిమా విడుదలైన రెండు మూడు రోజులకే.. రెండు.. మూడు నిమిషాలుండే కీ సీన్స్ రిలీజ్ చేస్తున్నారు. అక్కడే ఎందుకిలా ముందే రిలీజ్ చేస్తున్నారు..?


40సెకన్ల పాటు టీజర్ ను.. నిమిషంన్నరతో ట్రైలర్ ను రిలీజ్ చేయడం చూశాం. కానీ.. తమిళ సినిమా ఇండస్ట్రీలో సన్నివేశాలను స్నీక్ పీక్స్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. కార్తీ నటించిన ఖైదీకి తొలి ఆటకే పాజిటివ్ టాక్ వచ్చింది. రెండో రోజు నుంచి కలెక్షన్స్ పెరగడం మొదలైనా.. సినిమాలోని నాలుగు నిమిషాల సీన్ ను విడుదల చేశారు. ఆ తర్వాత హైలెట్ సీన్స్ తో కనువిందు చేశారు. 

 

సీన్స్ రిలీజ్ చేయడం వలన సినిమాకు హైప్ వస్తుందనుకుంటే పొరపాటే. హైలెట్స్ సీన్స్ రివీల్ చేయకుండా.. రొటీన్ సీన్స్ మాత్రమే చూపిస్తున్నారు. విశాల్ నటించిన యాక్షన్ రిలీజ్ అయిందో లేదో.. రెండు నిమిషాలు నిడివి ఉండే రెండు స్నీక్ పీక్స్ ను రిలీజ్ చేశారు. 

 

అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ఆదిత్య వర్మ నిమిషం 47సెకన్ల పాటు ఉంటే సీన్ ను సినిమా విడుదలకు ముందే చూపించాడు. ఇలా చూపించడం వల్ల సినిమాపై ఆసక్తి పెరుగుతుందన్న గ్యారెంటీ లేదు. హైలెట్ సీన్స్ చూపిస్తేనే క్రేజ్ వస్తుంది. రెగ్యులర్ సీన్స్ ను మాత్రమే స్నీక్ పీక్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. తమిళంలో మొదలైన ఈ పద్దతి తెలుగులోకి వస్తుందా అంటే.. ముందే చెప్పడం మనవాళ్లకు ఇష్టం ఉండదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: