టాలీవుడ్ లో ఎక్కువగా అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు మహేష్ బాబు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు  అమ్మాయిల కలల రాకుమారుడిగా ఉంటారు. అయితే మహేష్ బాబు ఏజ్ పెరిగినా కొద్ది రోజులు రోజుకు చాలా యంగ్ గా కనిపిస్తూ ఉంటారు. ఇక మహేష్ బాబు టాలీవుడ్ టాప్ హీరోగా కొనసాగుతున్నారు. టాలీవుడ్ హీరోల అందరి లో మహేష్ బాబు యాక్టింగ్ స్టైల్ వేరు అని చెప్పాలి. అంతేకాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు. ఊరిని బాగు చేసే యువకుడిగా, ఒక రాష్ట్రాన్ని ఏలే ముఖ్యమంత్రిగా, సక్సెస్ కోసం పరుగులు తీస్తే విద్యార్థిగా ఇలా విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ బాబు సినిమాలన్నీ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాయి  అనడంలో అతిశయోక్తి లేదు.  

 

 

 

 అయితే విభిన్నమైన కథలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటివరకు తన సినీ కెరీర్ లో కనిపించని ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు మహేష్ బాబు. సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలు మహేష్ బాబు ఒక ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాపై రోజురోజుకు  అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న  నటిస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో 13 ఏళ్ల తర్వాత డైనమిక్ నటి విజయశాంతి కూడా రీ ఎంట్రీ  ఇవ్వబోతున్నారు. దీంతో ఈ సినిమాకి మరింత హైప్ పెరిగిపోయింది. ఇక ఈ సినిమా గురించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా అది సెన్సేషనల్ గా మారిపోతుంది. 

 

 

 

 ఇదిలా ఉంటే ఈ సినిమా టీజర్  ఎప్పుడు ఎప్పుడు విడుదల అవుతుందా అని మహేష్ బాబు అభిమానులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు టీజర్ కి సమయం ఆసన్నమైనట్టు  కనిపిస్తుంది. టీజర్ విడుదల కు తేదీ ఖరారైపోయింది. ఈ నెల 22న సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాలకు సరిలేరు నీకెవ్వరు టీజర్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్రబంధం ఓ  ఫొటో  విడుదల చేసింది. ఇది మహేష్ బాబు అభిమానులకు ఓ శుభవార్త  అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: