ఈ యేడాది చిన్న సినిమాగా వ‌చ్చి పెద్ద విజ‌యం సాధించిన సినిమాల్లో నెంబ‌ర్ వ‌న్ అంటే ఆషిక్ 2 అనే చెప్పాలి. స్టార్ కాస్టింగ్ లేకుండా వ‌చ్చిన ఈ చిత్రం బాలీవుడ్ లో ఘ‌న విజ‌యం సాధించి..ఫిల్మ్ మేక‌ర్స్ అండ్ ..ట్రెడ్ ఎక్స్ ప‌ర్ట్స్ ను ఆశ్చర్య ప‌రిచింది.ఈ సినిమాతో వెండి తెర‌కు ప‌రిచ‌యం అయిన హాట్ బ్యూటీ శ్రద్దా క‌పూర్.. . బాలీవుడ్ హాట్ బ్యూటీస్ లో ఒక‌రిగా హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ఆఫ‌ర్స్ ఈ ముద్దుగుమ్మ‌మ చేతినిండా ఉన్నాయి. ప్రస్తుతం మోహిత్ సూరీ డైరెక్షన్ లో విల‌న్ సినిమా తో పాటు..యంగ్ హీరో షాహిద్ క‌పూర్ తో హైద‌ర్ అనే సినిమా చేస్తుంది. దీంతో పాటు అక్షయ్ కుమార్ స‌ర‌స‌న గ‌బ్బర్ చిత్రంలో కూడా న‌టిస్తుంది. అయితే ఈ మూడు సినిమాలు షూటింగ్ ఒకేసారి జ‌ర‌గుతుండ‌టంతో.. శ్రద్దా క‌పూర్ ఒక సినిమా ను వ‌ద‌లుకోవాల్సిన ప‌రిస్దెతి వ‌చ్చిందట‌. ఎందుకంటే.. సంక్రాంతికి అక్షయ్ కుమార్ న‌టించిన గ‌బ్బర్ సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. అయితే శ్రద్దా క‌పూర్.. విల‌న్ అండ్.. హైద‌ర్ చిత్రాల‌తో పాటు..గ‌బ్బర్ సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ చేస్తాన‌ని చెప్పినా.. గ‌బ్బర్ నిర్మాత‌లు మాత్రం శ్రద్దాను వాక్ ఔట్ చేయించారు. ఎందుకంటే వాళ్లు వేసిన లెక్కల ప్రకారం ఈ ముద్దుగుమ్మ మూడు సినిమాల‌కు డేట్స్ అడ్జెస్ట్ చేయ‌డం క‌ష్టమ‌ని భావించారు. సినిమాను ఇన్ టైమ్ లో విడుద‌ల చేయాలంటే.. శ్రద్దాను వ‌ద‌లుకోవాల్సిందేన‌ని డిసైడ్ కావ‌డంతో.. ఈ హాట్ బ్యూటీ అక్షయ్ గ‌బ్బర్ ను వ‌దులుకోక త‌ప్పలేదు మ‌రి. ఏం చేస్తారు..వ‌ర‌స‌గా ఇలా షూటింగ్ లున్నా.. ఇదే ప‌రిస్ధితే మ‌రి.!.

మరింత సమాచారం తెలుసుకోండి: