తండ్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఎన్టీఆర్ బయోపిక్ గా రెండు భాగాలుగా చిత్రీకరించి వరుసగా రెండు ఫ్లాపులు అందుకున్నాడు నందమూరి బాలకృష్ణ. రామారావు జీవితానికి సంబంధించి రాజకీయ రంగం మరియు సినిమా రంగానికి సంబంధించిన విషయాలను వెండితెరపై తెరకెక్కించిన బాలయ్యబాబు సరైన హిట్ అందుకోలేకపోయాడు. అయితే ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసిన బాలయ్య బాబు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా రెండో సారి గెలిచి ఆ తరువాత కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం లో ‘రూలర్’ అనే సినిమా స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో డిసెంబర్ నెలలో విడుదల కాబోతున్న  క్రమంలో బాలయ్య బాబు తన తర్వాత సినిమాని బోయపాటి దర్శకత్వంలో చేయటానికి రెడీ అయ్యారు.

 

గతంలో బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సింహ. లెజెండ్ లాంటి సినిమాలు బాలయ్య బాబు కెరీర్ లోనే అనేక రికార్డులు సృష్టించాయి. ఇటువంటి నేపథ్యంలో వీరిద్దరి కలయికలో మరో సినిమా వస్తున్న నేపథ్యంలో నందమూరి అభిమానులు ఈ సినిమాపై అంచనాలు విపరీతంగా పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా వీరిద్దరి కాంబినేషన్ సినిమాకి సంబంధించి ఒక కొత్త వార్త ఇండస్ట్రీలో వినబడుతోంది. మేటర్ ఏమిటంటే సినిమాలో బాలయ్య బాబు ను గతంలో ఎవరు ఎన్నడూ చూపించని విధంగా బోయపాటి చూపిస్తున్నట్లు ఒక సంచలన వార్త ఇండస్ట్రీలో వినబడుతుంది.

 

వీరిద్దరి కాంబినేషన్లో గతంలో రెండు సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని నందమూరి అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న రూలర్ సినిమాని క్రిస్మస్ పండుగ సందర్భంగా విడుదల చేయాలనే ఆలోచనలో రూలర్ సినిమా యూనిట్ ఉన్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: