టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేస్తుండగా క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ లో కె.ఎస్ రామారావు నిర్మిస్తున్నారు. సినిమాలో విజయ్ దేవరకొండ సరసన ముగ్గురు పాపులర్ హీరోయిన్స్ నటిస్తున్నారు. 

 

కోలీవుడ్ నుండి ఐశ్వర్యా రాజేష్ ఈ సినిమాతో పరిచయం కావాల్సి ఉన్నా ఈమధ్యనే కౌసల్యా కృష్ణమూర్తితో వచ్చి మెప్పించింది. ఇక సినిమాలో మరో హీరోయిన్ గా రాశి ఖన్నా నటిస్తుంది. మూడవ హీరోయిన్ గా కేథరిన్ త్రెసా కూడా ఈ సినిమాలో ఉందని తెలుస్తుంది. సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ తో విజయ్ ప్రేమలో పడతాడట.

 

అయితే ముగ్గురితోనూ లవ్ ఫెయిల్ అవుతుందట. అందుకే ఫస్ట్ లుక్ పోస్టర్ లో విరహ వేదనతో కనిపించాడు మన వరల్డ్ ఫేమస్ లవర్. సినిమా కథ కథనాలు యువతకు పిచ్చెక్కించడం ఖాయమని తెలుస్తుంది. అయితే ఈ సినిమా అసలైతే డిసెంబర్ లో రిలీజ్ చేయాల్సి ఉన్నా 2020 ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డేకి రిలీజ్ ఫిక్స్ చేశారట.

 

ప్రేమికుల రోజు విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు. చూస్తుంటే ఈసారి రౌడీ హీరో పక్కా హిట్టు కొట్టేలా ఉన్నాడు. ఫెయిల్యూర్ లవ్ స్టోరీతో వస్తున్న వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు విజయ్. సినిమా రషెస్ చూసిన చిత్రయూనిట్ మరో బ్లాక్ బస్టర్ సినిమా అవుతుందని అంటున్నారు. క్రాంతి మాధవ్సినిమా అవుట్ పుట్ విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నాడు. డియర్ కామ్రేడ్ ఫలితం నిరాశపరచడంతో విజయ్ దేవరకొండ కూడా వరల్డ్ ఫేమస్ లవర్ మీద పూర్తి ఫోకస్ పెట్టాడు. తప్పకుండా ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఉంటుందని రౌడీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: