రాజకీయాల్లో నుండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవి నటించిన రెండు సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా ఇటీవల నటించిన సైరా సినిమా అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో మరియు చిరంజీవి కెరీర్లో అనేక రికార్డులు క్రియేట్ చేసింది. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ తో చేయబోయే సినిమా కోసం రెడీ అవుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమా కోసం బరువు తగ్గాలని డైరెక్టర్ కొరటాల కోరడంతో ప్రస్తుతం చిరంజీవి జిమ్ లో వర్కౌట్లు చేస్తూ ఆరు పదుల వయసులో కూడా సినిమా కోసం డెడికేషన్ గా క్రమం తప్పకుండా డైట్ పాటిస్తూ స్లిమ్ అయ్యే పనిలో చిరంజీవి ఉన్నట్లు సమాచారం.

 

ఇదిలా ఉండగా చిరంజీవి.. కొరటాలతో చేయబోయే సినిమాకి సంబంధించి కొత్త వార్త ఇప్పుడు బయట వినబడుతోంది. అదేమిటంటే ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ ల విషయంలో అనేక పేర్లు ఇటీవల వినిపించాయి. మొదట్లో అంతా దేవిశ్రీయే అని అనుకున్నా చివరకు కాదని తేలిపోయింది.అలాగే ఈ చిత్రానికి కూడా ఓ బాలీవుడ్ సంగీత దర్శకున్ని పెట్టుకోబోతున్నారు అని కూడా టాక్ వచ్చింది.కానీ ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ చిత్రానికి ఓ సంచలన సంగీత దర్శకుడు లైన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన మరెవరో కాదు చిరంజీవి కెరీర్ లోనే అదిరిపోయే ఎన్నో మ్యూజిక్ ఆల్బం లు అందించిన మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ.

 

చిరంజీవి సినిమా అన్న ఆయన సినిమాకి సంబంధించి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వాలన్న మ్యూజిక్ డైరెక్టర్లలో మణిశర్మ ని మించిన వారు మరొకరు ఉండరని చాలామంది అప్పట్లో మణిశర్మ మరియు చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన సినిమాల గురించి ఇండస్ట్రీలో ఉన్నవారు కామెంట్ చేసేవారు. అయితే చాన్నాళ్లకు మళ్లీ చిరంజీవి సినిమా కి మణి శర్మ సంగీతమందిస్తున్నారు అన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో వినబడుతున్న క్రమం లో...ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని కామెంట్ చేస్తున్నారు మెగా అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: