టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్స్ కు పెద్దగా డిమాండ్ ఉందదని చెప్పడం ఒకప్పటి మాట. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్స్ కూడా నటిస్తున్నారు. అయితే ముంబై భామల్లా రెచ్చిపోయి గ్లామర్ షో చేయడం ఇక్కడ వారి వల్ల కాదు. వచ్చిన అరకొర అవకాశాలతో కెరియర్ సాగించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం తెలుగు అమ్మాయిగా తెలుగు సినిమాల్లో రాణిస్తున్న వారిలో ఈషా రెబ్బ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 

స్టార్ హీరోయిన్ కాకున్నా సగటు హీరోయిన్ గా ఛాన్సులు అందుకుంటుంది. అంతకుముందు ఆ తర్వాత సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు కెరియర్ అలా సాగిస్తుంది. ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి డైరక్షన్ లో రాగల 24 గంటల్లో సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈషా రెబ్బ. ఈ సినిమాలో ఈషా కాస్త హాట్ గా కనిపించిందని తెలుస్తుంది.   

 

అయితే సినిమాల్లో పెద్దగా స్కిన్ షో చేయడానికి ఇష్టపడని ఈషా ఫోటో షూట్స్ లో మాత్రం రెచ్చిపోతుంది. అదేంటి అని అడిగితే తనకు వచ్చే పాత్రలకు స్కోప్ ఉండకపోవడం వల్లే తను పద్ధతిగా కనిపించాల్సి వస్తుందని అన్నది. అంతేకాదు తనలో కూడా హాట్ నెస్ ఉందని అందుకే దాన్ని ఫోటో షూట్స్ ద్వారా బయటపెడతానని అంటుంది ఈషా రెబ్బ.  

 

సరైన ఛాన్స్ రావాలే కాని తనలోని అందం, అభినయం రెండూ చూపించేస్తా అంటుంది ఈషా. ఇప్పటివరకు తనని ఈ యాంగిల్ లో ఎవరు వాడలేదని.. తనలో కూడా హాట్ నెస్ ఉందని అలాంటి ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నా అని చెప్పుకొచ్చింది ఈషా రెబ్బ. అయితే తెలుగు హీరోయిన్ గా తనకు స్టార్ ఛాన్సులు ఆశిస్తున్న ఈ అమ్మడికి హీరోయిన్ గా కాకున్నా స్టార్ హీరోల సినిమాల్లో మంచి పాత్రలు పడాలని ఆశిద్దాం. తన కెరియర్ లో స్టార్ హీరోతో చేసిన సినిమా అరవింద సమేత. ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబోలో వచ్చిన ఆ సినిమాలో తారక్ మరదలిగా నటించింది ఈషా రెబ్బ. 

మరింత సమాచారం తెలుసుకోండి: