బాహుబలి వంటి భారీ విజయం తరువాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా RRR. టాలీవుడ్ ఇండస్ట్రీలో మొట్టమొదటిసారి మెగా కుటుంబం మరియు నందమూరి కుటుంబాలకు చెందిన హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ సినిమా పై దేశ వ్యాప్తంగా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించడం తో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని చాలా మంది సినిమా ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. 

 

350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చాలా శరవేగంగా సాగుతోంది. అనుకున్న టయానికి సినిమాను విడుదల చేయడానికి అనగా రాబోయే ఏడాది జులై చివరి మాసంలో ఈ సినిమా విడుదల చేయాలని డైరెక్టర్ రాజమౌళి పక్కా ప్లానింగ్ తో సినిమా రెడీ చేస్తున్నట్లు గాయాల కారణంగా ఇటీవల సినిమాకి సంబంధించిన షూటింగ్ ఆగిపోయిన కానీ ఎక్కడా కూడా సినిమా లేట్ అవకుండా అనుకున్న టయానికి సినిమా విడుదల చేయాలని రాజమౌళి సినిమా షూటింగ్ విషయంలో చాలా కష్టపడుతున్న ట్లు సమాచారం. 

 

ఇప్పటికే సినిమా షూటింగ్ సగానికిపైగా పూర్తయినట్లు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. తారక్ కొమురం భీమ్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇక మిగతా షూటింగ్ కూడా త్వరలోనే పూర్తి చేసి వీలైనంతవరకు ప్రమోషన్ కార్యక్రమాలు ముందుగానే మొదలుపెట్టాలని రాజమౌళి ఆలోచిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాకి సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ ప్రకటించడానికి సినిమా యూనిట్ రెడీ అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. విషయంలోకి వెళితే ఈ సినిమాలో రామ్ చరణ్ పక్కన హీరోయిన్ గా ఆలియా భట్ నటిస్తున్న విషయం అందరికీ తెలిసినదే. అయితే ఎన్టీఆర్ పక్కన ఎవరు నటిస్తారు అన్న దాని గురించి సినిమా యూనిట్ ఓ క్లారిటీ ఇవ్వడానికి రెడీ అయినట్లు ఫిలింనగర్లో వినబడుతున్న టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: