కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ హీరోగా యువ దర్శకుడు అట్లీ డైరక్షన్ లో వచ్చిన సినిమా బిగిల్. తెలుగులో ఈ సినిమాను విజిల్ గా రిలీజ్ చేశారు. విజయ్ సినిమాలకు తెలుగులో మంచి డిమాండ్ ఉంటుంది. హీరో గారు ప్రమోషన్స్ కు రాకున్నా అతని మీద అభిమానం చూపిస్తారు మన ప్రేక్షకులు.

 

విజయ్ తన ప్రతి సినిమాలో ఏదో ఒక సోషల్ మెసేజ్ ఉండేలా జాగ్రత్త పడతాడు. ఇక అట్లీతో తెరి, మెర్సల్ సినిమాల హిట్ తర్వాత హ్యాట్రిక్ మూవీగా బిగిల్ వచ్చింది. తెరి పోలీస్ గా తెలుగులోకి డబ్ అయ్యింది. మెర్సల్ మూవీ అదిరిందిగా వచ్చింది. ఇక బిగిల్ కాస్త విజిల్ గా వచ్చి హిట్ అందుకుంది.

 

విజిల్ సినిమాను తెలుగులో mahesh KONERU' target='_blank' title='మహేష్ ఎస్ కోనేరు -గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మహేష్ ఎస్ కోనేరు రిలీజ్ చేశారు. ఈ సినిమాను 9.75 కోట్లకు కొన్నారు. అయితే ఈ సినిమా ఫుల్ రన్ లో తెలుగులో కేవలం 10.91 కోట్లను మాత్రమే రాబట్టింది. అయితే బిగిల్ కోలీవుడ్ లో సెన్సేషనల్ హిట్ అయ్యింది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 200 కోట్ల గ్రాస్ వసూళు చేసింది. ఇక ఈ సినిమాతో విజయ్ మరోసారి తన సత్తా చాటాడు. 

 

అయితే ఈ సినిమాతో పాటుగా రిలీజైన కార్తి ఖైది కూడా మంచి విజయాన్ని అందుకుంది. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఖైది సినిమా తెలుగు, తమిళంలో క్రేజీ హిట్ అందుకుంది. అది కేవలం వరల్డ్ వైడ్ గా 30 కోట్ల బిజినెస్ చేయగా ఫుల్ రన్ లో 60 కోట్ల దాకా రాబట్టినట్టు తెలుస్తుంది. మొత్తానికి దీవాళికి వచ్చిన రెండు తమిళ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే తెలుగులో మాత్రం విజయ్ విజిల్ కన్నా కార్తి ఖైదినే మంచి విజయం అందుకుందని చెప్పడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: