శర్వానంద్ హీరోగా తెరకెక్కిన రన్ రాజా రన్ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు యువ దర్శకుడు సుజిత్. తొలుత యూట్యూబ్ లో పలు సక్సెస్ఫుల్ షార్ట్ ఫిలిమ్స్ చేసిన అనంతరం, ఒకరోజు అతడిని పిలిపించిన యువీ క్రియేషన్స్ నిర్మాతలు, శర్వానంద్ కోసం ఒక కథ తయారు చేయమని అడగడంతో, కొద్దిరోజుల సమయం తీసుకుని రన్ రాజా రన్ స్టోరీ వారికి వినిపించడం, వెంటనే అది సినిమాగా రూపాంతరం చెందడం జరిగిపోయాయి. 

 

అయితే తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న సుజిత్ పనితనాన్ని చూసి, ఏకంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన సాహో మూవీ కి డైరెక్టర్ గా అవకాశం ఇవ్వడం జరిగింది. అత్యున్నత సాంకేతిక విలువలతో, అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆ సినిమా, ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి పరాజయాన్ని మూటగట్టుకుంది. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్, సెట్టింగ్స్, హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ వంటివి చాలా బాగున్నపిప్పటికీ, సగటు ప్రేక్షకుడు ఆశించే ఆకట్టుకునే కథ కథనాలు లేకపోవడంతో ప్రేక్షకులు ఆ సినిమా పై పెదవి విరిచారు. అయితే ఒక్క నార్త్ లో మాత్రం బాగానే రాబట్టిన సాహో సినిమా, ఓవర్ ఆల్ గా మాత్రం ఫ్లాప్ గా నిలిచింది. దానితో సుజిత్ పై చాలావరకు నెగటివిటి కూడా స్ప్రెడ్ అయింది. 

 

ఇక ఆ తరువాత కొంత ఆలోచనలో పడ్డ సుజిత్, తన తదుపరి సినిమాని మరొక్కసారి శర్వానంద్ తో చేయాలని సిద్ధం అయ్యాడట. అలానే ఆయన కోసం ఒక మంచి కథ తయారు చేశాడని, అతి త్వరలోనే దానిని శర్వాకు వినిపించబోతున్నట్లు తెలుస్తొంది. అయితే సుజిత్ విషయమై మరొక వాదన కూడా ఫిల్మ్ నగర్ వర్గాల్లో ప్రచారం అవుతోంది. అదేమిటంటే, సాహో రిజల్ట్ ఎఫెక్ట్ తో సుజిత్ తో సినిమాను చేయడానికి హీరోలు భయపడుతున్నారని, అతడితో సినిమా కోసం ఏ హీరో కూడా ఆసక్తి కనపరచకపోవడంతో, మరొక్కసారి తన టాలెంట్ ని శర్వా తో చేయబోయే సినిమా ద్వారా ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడట సుజీత్. మరి అతడి ఆశలు ఎంతవరకు ఫలించి, అతడికి సక్సెస్ ని అందిస్తాయో చూడాలి.......!!

మరింత సమాచారం తెలుసుకోండి: