‘సైరా’ మూవీతో  సురేందర్ రెడ్డికి దర్శకుడుగా మంచి పేరు వచ్చినా టాప్ హీరోలు ఎవ్వరు వెంటనే సురేంద్ర రెడ్డిని లైన్ లో పెట్టి తమ తదుపరి సినిమాను ప్రకటించే పరిస్థితులు ఏర్పడలేదు. దీనికితోడు ప్రస్తుతం టాప్ హీరోలు అంతా వారివారి సినిమాల ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న నేపధ్యంలో సురేందర్ రెడ్డి పై అభిప్రాయం ఉన్నా వారి డేట్స్ ఇవ్వలేని పరిస్థితి. 

ఇలాంటి పరిస్థితులలో సురేందర్ రెడ్డి ఈమధ్య ఒకమీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ ను దృష్టిలో పెట్టుకుని చేసిన కామెంట్స్ అతడి అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈఇంటర్వ్యూలో సురేందర్ రెడ్డి మాట్లాడుతూ తనదృష్టిలో ‘సాహో’ సినిమాను ఫ్లాప్ గా పరిగణించడం అన్యాయం అంటూ కామెంట్స్ చేసాడు. 

అంతేకాదు బాలీవుడ్ బాక్స్ ఆఫీసు వద్ద ‘సాహో’ 150 కోట్లు కలెక్ట్ చేసినప్పుడు ఆమూవీని ఫ్లాప్ సినిమాగా ఎలా పరిగణిస్తారు అంటూ సురేందర్ రెడ్డి ప్రభాస్ ను బుట్టలో పెట్టుకోవడానికి ప్రశంసలు కురిపించాడు. ఇదేసందర్భంలో మరొక ట్విస్ట్ ఇస్తూ ఈదర్శకుడు జూనియర్ తో తాను గతంలో తీసిన ‘అశోక్’ మూవీ పై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసాడు. వాస్తవానికి 2006 ప్రాంతంలో తాను ప్రభాస్ తో సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తుంటే తన దగ్గరకి జూనియర్ ఎన్టీఆర్ దగ్గర పనిచేసే మేనేజర్ వచ్చి బలవంతం పెట్టడంతో తాను అప్పట్లో జూనియర్ తో ‘అశోక్’ సినిమాను తీయవలసి వచ్చింది అని వివరించాడు.

వాస్తవానికి ఆకథ తాను ఎంచుకున్నది కాదనీ జూనియర్ ఇష్టపడటంతో కొన్ని అనుకోని పరిస్థితులు వల్ల తాను అప్పట్లో తారక్ తో ‘అశోక్’ సినిమాను చేసిన విషయాన్ని ఇప్పుడు బయటపెట్టాడు. ఇప్పుడు ఈకామెంట్స్ జూనియర్ అభిమానుల దృష్టి వరకు వెళ్ళడంతో వారంతా సురేందర్ రెడ్డి తీరును విమర్శిస్తూ ‘అశోక్’ సినిమా ఫ్లాప్ అయినా జూనియర్ సురేందర్ రెడ్డిని పిలిచి ‘ఊసరవిల్లి’ మూవీ ప్రాజెక్ట్ చేతిలో పెట్టిన విషయాన్ని ఆమూవీ ఫ్లాప్ అయినా జూనియర్ సురేందర్ రెడ్డిని ఒక్క మాట కూడ అనని సంస్కారాన్ని మరిచిపోయారా అంటూ తారక్ అభిమానులు సురేందర్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విపరీతంగా సెటైర్లు వేస్తున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: