వృత్తిని దైవంగా భావిస్తామని చాలామంది నటీనటులు చెబుతుంటారు. మరి.. దేవత,  దేవుడు పాత్రలు చేసే అవకాశం వస్తే.. ఎంతో నిష్టగా ఉంటారు. అందుకు చాలా ఉదాహరణలున్నాయి. జయప్రద, రమ్యకృష్ణ, రోజా వంటివారు భక్తిరసాత్మక చిత్రాల్లో నటించేటప్పుడు చాలా నియమాలు పాటించేవారు. ‘అన్నమయ్య, నమో వెంకటేశాయ’ వంటి చిత్రాల్లో నటించేటప్పుడు నాగార్జునతో సహా ఆ చిత్రబృందం షూటింగ్‌ పరిసరాల్లో పాదరక్షలు వాడలేదు. ఇప్పుడ  అందాల ముద్దు గుమ్మా  నయనతార గురించి చెప్పాలి. ‘శ్రీరామరాజ్యం’ సినిమాలో సీత పాత్ర చేసినప్పుడు నయనతార శాకాహారం మాత్రమే తీసుకునేవారు. ఎంతో నిష్ఠతో ఉండేవారు అని చెప్పారు .ప్రస్తుతం నయనతార  ‘మూక్కుత్తి అమ్మన్‌’ అనే తమిళ చిత్రం ఒక గొప్ప పాత్రలో నటిస్తుంది ఈ చిత్రం  పూర్తయ్యేవరకూ ఈ బ్యూటీ నయనతార  మాంసాహారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.

 

ఈ చిత్రం లో నయన మామూలు అమ్మాయిగా కనిపించడంతో పాటు అమ్మవారిలా కూడా కనిపిస్తారట. నయనతార ఈ చిత్రంలో అమ్మవారి పాత్ర చేసేటప్పుడు ఒకపూట ఉపవాసం కూడా ఉండాలని నిర్ణయించుకున్నారని చిత్రబృందం పేర్కొంది. ఆర్జేగా మంచి గుర్తింపు తెచ్చుకుని, నటుడిగా మారిన బాలాజీ ఈ చిత్రంలో కీలక పాత్ర చేయడంతో పాటు దర్శకత్వం వహించనున్నారు. అయితే ఇందులో బాలాజీ సరసన నయనతార నటించడం లేదు.

 

ఈ చిత్రంలో ఆమె పాత్ర  సినిమాకి కీలకంగా నిలిచే పాత్రగా ఉండిపోతుంది . ‘మూక్కుత్తి అమ్మన్‌’ అంటే కన్యాకుమారి అమ్మవారు  అని పిలుస్తారు. అందుకని కన్యాకుమారి వెళ్లి సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలను అమ్మవారి గుడిలో జరపాలనుకుంటున్నారట. త్వరలో ఈ చిత్రం ప్రారంభం కానుంది.ఇదే కాదు దేవునికి సంబంధించిన ఏ చిత్రమైన సరే నయనతార ఎంతో నిష్ఠతో చేస్తానని చెప్పుకొచ్చారు .

 

బాలాజీ దర్శకత్వం లో ఈ  చిత్రం తమిళంలో రూపొందించనున్నారు .అతి త్వరగా ఈ చిత్రాన్ని ముగించి అభిమానులముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం ప్రయత్నిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: