‘అల వైకుంఠపురములో’ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో ఈ మూవీకి అయిన ఖర్చుల గురించి లెక్కలు వేస్తే మొత్తం ఖర్చు 120 కోట్లకు చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ కు పారితోషికంగా ఇస్తున్న 25 కోట్లు త్రివిక్రమ్ తీసుకుంటున్న 15 కోట్ల పారితోషికంతో ఈ మూవీ బడ్జెట్ తార స్థాయికి చేరిపోయింది అని లీకులు వస్తున్నాయి. దీనితో తండ్రి దగ్గర 25 కోట్లు పారితోషికం తీసుకున్న హీరోగా బన్నీ కొత్త రికార్డు క్రియేట్ చేసాడు.

ప్రస్తుతం ఈ మూవీకి ఏర్పడిన మ్యానియా రీత్యా 120 కోట్లకు పైగా బిజినెస్ చేసి రాబట్టుకోవడం కష్టం కాకపోయినప్పటికీ బన్నీ కెరియర్ లో అత్యంత ఖరీదైన సినిమాగా తీయబడ్డ మూవీగా మారింది. ఈ మూవీని కొనుక్కున్న బయ్యర్లు లాభ పడాలి అంటే ఈ మూవీకి ఖచ్చితంగా 200 కోట్ల గ్రాస్ కలక్షన్స్ రావలసిన పరిస్థితి ఏర్పడింది. 

దీనితో సంక్రాంతి రేసుకు రాబోతున్న భారీభారీ సినిమాల మధ్య బన్నీ మూవీ ఆ రేంజ్ కలక్షన్స్ రాబట్టగలుగుతుందా అన్న సందేహాలు అరవింద్ కు కూడ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీకి ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో అదేవిధంగా ఈ మూవీ ప్రమోషన్ ఫంక్షన్ విజయవాడలో నిర్వహించి ఈ రెండు రాష్ట్రాలలోను ఈ మూవీకి మరింత మ్యానియా పెంచి అత్యంత భారీ ఓపెనింగ్స్ రాబట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

ఇప్పటికే ఈ మూవీలోని పాటలు సూపర్ హిట్ అయినప్పటికీ సినిమా కథలో బలం లేకుంటే పాటలు హిట్ అయినా సినిమాలు ఫెయిల్ అయిన నేపద్యంలో త్రివిక్రమ్మూవీ కథలో చూపించే ప్రత్యేకతను బట్టి ఈ మూవీ రికార్డులు ఆధారపడి ఉంటాయి. ఇది ఇలా ఉండగా ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ మహేష్ బన్నీలకు సూచించిన రివర్స్ ప్రమోషన్ ఆలోచనకు ఇంకా బన్నీ మహేష్ ల నుండి గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలుస్తోంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: