ప్రస్థుతం సమంత నటిస్తున్న ‘96’ మూవీ రీమేక్ తప్ప మరే సినిమాలోను సామంత నటించడం లేదు. దీనికితోడు ఈ మధ్య లేటెస్ట్ గా జరిగిన అక్కినేని అవార్డ్స్ ఫంక్షన్ లో సమంత కనిపించక పోవడంతో ఆమెకు ఏమైంది అంటూ వార్తలు గుప్పుమన్నాయి. వాస్తవానికి సమంత అమెజాన్ ప్రైమ్ సంస్థ నిర్మిస్తున్న ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్ లో మహిళా ఉగ్రవాదిగా నటిస్తోంది. 

ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కోసం సమంత అక్కినేని అవార్డ్ ఫంక్షన్ కు డుమ్మా కొట్టింది అన్న కామెంట్స్ కూడ వచ్చాయి. ఇలాంటి పరిస్థితులలో సమంత లేటెస్ట్ గా తన అభిమానులతో సోషల్ మీడియాలో ఛాట్ చేస్తూ తన అభిమానులను ఫూల్స్ చేయడానికి ప్రయత్నించింది.

క్రేజీ హీరోయిన్ సమంత తల్లి సమంతగా ఎప్పుడు మారుతుంది అంటూ ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు వింత సమాధానం ఇచ్చింది. తన శరీరంలో ఇప్పుడు చాల మార్పులు వస్తున్నాయని అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ‘2022 ఆగస్ట్‌ ఏడో తేదీన... ఉదయం ఏడు గంటలకు నేను ఓ బేబీకి జన్మనివ్వబోతున్నా' అని సమాధానం చెప్పింది.


దీనితో ఈ సమాధానం చూసిన సమంత అభిమానులు షాక్ అవ్వడమే కాకుండా 2022 సమంత తల్లి కాబోతుంటే ఇప్పటి నుంచి శరీరంలో మార్పులు ఏమిటి అంటూ సమంత అభిమానులు ఆశ్చర్య పోతున్నారు. అయితే సమంత రిప్లయ్ లో ఒక లీక్ ఉంది. తాను ఒక బిడ్డకు తల్లిగా మారేది 2022లో అని సంకేతాలు ఇస్తున్న నేపధ్యంలో అప్పటి వరకు సమంత సినిమాలలో కొనసాగుతాను అన్న క్లారిటీని పరోక్షంగా ఇచ్చింది అనుకోవాలి. నటనలోనే కాదు ఏ మాటకు అయినా గట్టి సమాధానం ఇవ్వడంలో తెలివితేటలు చూపించే సమంత మాట తీరు తన మామ నాగార్జునకు కూడ నచ్చుతుంది అంటే సమంత ఎంత తెలివిగా మాట్లాడుతుందో అర్ధం అవుతుంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: