'నువ్వేం మాయ చేసావో కాని' అంటూ ఒక్కడు సినిమా లో భూమిక మన అందరిని నిజంగానే తన అందంతో మాయ చేసింది. 2000 సంవత్సరంలో సుమంత్ హీరోగా తెరకెక్కిన యువకుడు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది భూమిక. తరువాత వరుసగా ఖుషీ, ఒక్కడు, సింహాద్రి లాంటి బ్లాక్‌ బస్టర్లతో టాప్‌ హీరోయిన్‌గా ఎదిగింది. యువ హీరోల దగ్గర నుంచి సీనియర్ హీరోల వరకు అందరితో నటించింది ఈ భామ, మెగాస్టార్ చిరంజీవి సరసన కూడా నటించి మెప్పించింది. కెరీర్ మంచి ఊపు లో ఉన్నటుండి ఈ బ్యూటీ పెళ్లి చేసుకోవడం, సినిమా అవకాశాలు తగ్గిపోవడం చక చక జరిగిపోయాయి. 

 

లేట్ వయసులో కూడా భూమిక హాట్ గా కనిపిస్తా అంటోంది, ఈ యోగ అందం ప్రస్తుతం తెలుగులో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న రూలర్‌ సినిమాలో నటిస్తోంది. భూమిక సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన సినిమాల విశేషాలతో పాటు ఫోటోలను అభిమానుల కోసం తన ఖాతా నుంచి షేర్ చేస్తోంది. ఈ క్రమం లో నే భూమిక షేర్ చేసిన ఒక ఫోటో మతి పోగొట్టేలా ఉంది నల్ల కళ్లద్దాలు పెట్టుకుని బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో రాయల్ ఎన్ఫీల్డ్  బైక్ మీద పడుకుని ఉన్న ఫోటో ను షేర్ చేసింది భూమిక. ఫోటో లో అమ్మడు చాలా హాట్ గా ఉంది. 

 

ఇక నెటిజెన్స్ ఈ ఫోటో పై కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. లేట్ వయసులో ఈ హాట్ ఫోటో ఏంటి అని. అయితే ఈ ఫోటో ఇప్పటిది కాదు అని తెలుస్తోంది భూమిక టాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉన్నప్పుడు దిగిన ఫోటో అని అర్ధమవుతోంది. భూమిక సినిమాలకు రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. నాని నటించిన ఎంసీఏ మూవీ లో హీరో నాని కి వదిన గా నటించి ప్రశంసలు అందుకుంది భూమిక.

మరింత సమాచారం తెలుసుకోండి: