కాజల్ అగర్వాల్.. అందాల చందమామలా  టాలీవుడ్లో పేరు తెచ్చుకుంది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టాటస్ సంపాదించుకుంది. కాజల్ మగ‌దీరుడితో పోటీ పడిన ధీర వనితగా నూటికి నూరు  శాతం మార్కులు కొట్టేసింది. ఇక ఒకనాడు టాప్ స్టార్స్ ఫస్ట్ చాయిస్ గా కాజల్ ఉండేది. కాజల్ లేని సినిమా కొన్ని ఏళ్ళపాటు ఊహించలేని పరిస్థితి. ఎందుకంటే అందంతో అభినయంతో పాటు ప్రొఫెషన్ పట్ల డెడికేషన్ కాజల్ ప్లస్ పాయింట్లు. కాజల్ విషయంలో ఎవరూ ఒక్క నెగిటివ్ పాయింట్ కూడా చూపించలేరు.

 

ఇన్నేళ్ళ కెరీర్లో కాజల్ ఎపుడు వివాదాల జోలికి పోలేదు కూడా. ఇదిలా ఉండగా కాజల్ కెరీర్ కొన్నాళ్ళుగా డల్ గా సాగుతోంది. ఆమె చేసిన సినిమాలు కూడా ఫ్లాప్ అవుతున్నాయి. ఈ ఏడాది తేజ తీసిన లేడీ ఓరియెంటెడ్ మూవీ సీత కూడా ఫట్ కావడంతో కాజల్ కెరీర్  ఇక కష్టమేనని అంతా అనుకున్నారు. కాజల్ కూడా మూడు పదుల వయసు దాటిపోయింది. ఇక పెళ్ళి చేసుకుని సెటిల్ అవుతుందని  కూడా అనుకుంటున్నారు.

 

కమల్ తో ఇండియన్ టు మూవీ చేస్తున్న కాజల్ ఇపుడు హఠాత్తుగా తెలుగులో కొత్త మూవీకి సైన్ చేసింది. ఆ మూవీ శ్రీ విష్ణుది కావడం విశేషం. తిప్పరా మీసం మూవీతో మాస్ ఇమేజ్ కోసం ట్రై చేసిన శ్రీ విష్ణు ఇపుడు కొత్త మూవీ తీస్తున్నాడు. శ్రీ విష్ణు  లక్ష్య ప్రొడక్షన్లో తీస్తున్న ఈ మూవీకి ప్రదీప్ వర్మ డైరెక్టర్ గా ఉన్నారు. ఈ మూవీలో శ్రీ విష్ణు పెయిర్ గా కాజల్ కనిపించబోతోందట. 

 


నిజంగా ఇది కొత్త న్యూసే. టాప్ స్టార్స్ తో నటించిన కాజల్ ఇపుడు కొత్త హీరోల పక్కన యాక్ట్ చేయడం షాకింగే. అయితే కాజల్ కెరీర్ ఫైనల్ స్టేజ్ లో ఇలాంటి మెరుపులు మరిన్ని ఉంటాయని అంటున్నారు. తాను ఎవరితోనైనా  ఓకే  అంటున్న కాజల్  సీనియర్ హీరోలతో  కూడా జోడీకి రెడీ అంటోందట. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: