60 సంవత్సరాల బాలకృష్ణ తన వయసును 10 సంవత్సరాలు తగ్గించుకుని నటిస్తున్న ‘రూలర్’ మూవీకి సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీలో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లో వచ్చే ఒక పాటలో బాలయ్య కన్నడ బ్యూటీ హీరోయిన్ వేదిక తో ఒక డీప్ లిప్ లాక్ సీన్ లో నటించినట్లు షాకింగ్ న్యూస్ బయటకు వస్తోంది. 

ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో లిప్ లాక్ సీన్స్ కు చిరునామాగా విజయ్ దేవరకొండ కొనసాగుతున్నాడు. ఇలా బాలయ్య ఈ లేట్ వయసులో ఇలాంటి రొమాంటిక్ సీన్స్ లో కనిపిస్తే జనం ఎంతవరకు హర్షిస్తారు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఈ మధ్యనే నాగార్జున ఇలాంటి ప్రయోగం తన లేటెస్ట్ మూవీ ‘మన్మధుడు 2’ లో చేసి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొని అవమాన పాలయ్యాడు. 

ఇప్పుడు బాలయ్య ఇలాంటి ప్రయోగం చేసినంత మాత్రాన కలక్షన్స్ వస్తాయా అన్న సందేహాలు కలుగుతున్నాయి. బాలయ్య సినిమాలకు నందమూరి అభిమానులు తప్ప యూత్ ధియేటర్స్ కు రావడం ఎప్పుడో మానేశారు. సినిమా పై బాగా పాజిటివ్ టాక్ వచ్చినప్పుడు మాత్రమే బాలయ్య నటించే సినిమాల కోసం ధియేటర్స్ వద్దకు వస్తున్నారు. 

ఇలాంటి పరిస్థితులలో దర్శకుడు కె.ఎస్. రవికుమార్ బాలయ్యతో చేస్తున్న ప్రయోగం పై బాలయ్య అభిమానులకే సందేహాలు ఉన్నట్లు టాక్. బాలయ్యకు సెంటిమెంట్ గా కలిసి వచ్చే పోలీసు పాత్రలో ఈ మూవీలో కనిపిస్తున్నా బాలయ్య ఎప్పుడు టచ్ చేయని క్రిస్మస్ సీజన్ ను తన ‘రూలర్’ తో టచ్ చేస్తూ ఉండటంతో ఎంత వరకు సక్సస్ అవుతాడు అన్న సందేహాలు ఉన్నాయి. ఏమైనా బాలయ్య యంగ్ హీరోలతో పోటీ పడుతూ తన లుక్ ను మార్చుకోవడమే కాకుండా ఏకంగా లిప్ లాక్ సీన్స్ లో కూడ నటించడంతో బాలయ్య పూర్తిగా మారిపోయాడు అని అందరికి అనిపిస్తోంది.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: