ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ప్రారంభం కాబోతున్న మూవీ గురించి రెడీ అవుతున్న చిరంజీవి తన డ్రీమ్ ప్రాజెక్ట్ మెగా స్టూడియోస్ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి చిరంజీవి తనకు హైదరాబాద్ లోని కోకాపేటలో ఉన్న పెద్ద స్థలంలో మెగా స్టూడియోస్ నిర్మించాలని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడమే కాకుండా దానికి సంబంధించిన విధి విధానాల గురించి అనుమతులు గురించి చాల లోతుగా విశ్లేషణలు చేసినట్లు తెలుస్తోంది. 

అయితే ఈ పరిశీలనలో చిరంజీవికి కొన్ని యదార్ధ విషయాలు తెలియడమే కాకుండా ప్రస్తుతం భాగ్యనగరంలోని ఫిలిం స్టూడియోల పరిస్థితి పై ఒక అవగాహన వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో నిర్వహింప బడుతున్న ఒక్క రామోజీ ఫిలిం సిటీకి తప్ప మరే ఫిలిం స్టూడియోకి చెప్పుకోతగ్గ స్థాయిలో లాభాలు రావడం లేదు అన్న వాస్తవాలు చిరంజీవి దృష్టికి వచ్చినట్లు టాక్.

దీనికితోడు ప్రస్తుతం సినిమాలు తీస్తున్న చాలామంది ప్రముఖ నిర్మాతలు తమ ఆఫీసులోనే ఎడిటింగ్ రూమ్ అదేవిధంగా డబ్బింగ్ స్టూడియోలను ఏర్పాటు చేసుకుంటున్నారు. దీనితో స్టూడియోలలోని డబ్బింగ్ ఎడిటింగ్ రూమ్స్ కు బుకింగ్ లు తగ్గిపోయాయన్న వాస్తవాలు చిరంజీవి దృష్టికి రావడంతో తన మెగా స్టూడియో ఆలోచనలు విరమించుకున్నట్లు లీకులు వస్తున్నాయి. 

దీనితో కోకాపేటలో ఎకరాలలో భూమి ఉన్న చిరంజీవి తన స్థలంలో అత్యంత అధునాతన హంగులతో ఒక భారీ కమ్యూనిటీ హాల్ కడితే చాల బాగుంటుందని దానివల్ల సంవత్సరం పొడుగునా ఆదాయమే కాకుండా సినిమా ఫంక్షన్స్ కు కూడ అనువుగా ఉంటుందని చిరంజీవి సన్నిహితులు సూచిస్తున్నట్లు టాక్. దీనితో తన మెగా స్టూడియో ఆలోచనలను పూర్తిగా చిరంజీవి విరమించుకుని ‘కొణిదల కమ్యూనిటీ హాల్’ డిజైన్స్ గురించి ముంబాయ్ ప్రాంతానికి చెందిన ప్రముఖ ఆర్కటిక్ తో సంప్రదింపులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలలో ఎన్ని యదార్దాలో తెలియక పోయినా మెగా స్టూడియోస్ వస్తుందని కలలు కంటున్నా మెగా అభిమానులకు ఇది షాకింగ్ న్యూస్ అనుకోవాలి..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: