సినిమా రంగం అంటేనే ఆడవాళ్లలో ఓ రకమైన భావన ఉంటుంది. కాని ఇక్కడ వచ్చే పేరు ప్రతిష్టలు, డబ్బు సంపాదన చూసి చాలమంది ఇష్టం లేకున్న మనసు చంపుకుని ఈ రంగంలో అడుగుపెడుతున్నారు. తనలో ఉన్న అన్ని, దాదాపు వదిలేస్తేనే ఇక్కడ రాణించగలరని ఎందరో అనుకుంటారు.

 

 

అది నిజమో, అబద్దమో నటించే వాళ్లకే తెలియాలి. ఇక ఒక్కోసారి చేసే కొన్ని కొన్ని సీన్లలో నటీమణులు పడే ఇబ్బంది ఎంతలా ఉంటుందంటే చెప్పలేని విధంగా, చెప్పుకోరానంత బిడియంగా అక్కడి పరిస్దితులు ఎదురవుతాయి.. ఇకపోతే ప్రపంచ వ్యాప్తంగా ఎంత పాపులర్ అయినా అమెరికన్ టెలివిజన్ డ్రామా సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ లో నటించిన ప్రతి ఒక్కరికి కేవలం ఈ ఒక్క షో వల్ల హాలీవుడ్ స్టార్లకు కంటే రెట్టింపు పాపులారిటీ దక్కింది. ఈ సిరీస్‌లో నటించినవారిలో ఎమీలియా క్లార్క్ అనే నటి కూడా ఉన్నారు.

 

 

తాను కీలక పాత్రలో నటించిన ఈ షో హిట్ అయినందుకు సంతోషంగా ఉన్నప్పటికీ తన చేత బలవంతంగా నగ్న సన్నివేశాల్లో నటింపజేసినందుకు బాధపడ్డానని తెలిపారు. ఇకపోతే అవసరం లేని చోట నా చేత దుస్తులన్నీ విప్పించారు. ఈ విషయంలో రోజూ నాకు డైరెక్టర్స్‌కి మధ్య సెట్‌లో గొడవలు జరుగుతుండేవి.

 

 

దుస్తులు విప్పనని నేను లేదు విప్పాల్సిందేనని డైరెక్టర్స్ వాదులాడుకునేవాళ్లం. నేను నగ్న సన్నివేశాల్లో నటించకపోతే ఫ్యాన్స్ బాధపడతారని చెప్పేవారు. దాంతో ఆ సన్నివేశాల్లో నటించేటప్పుడు ఇబ్బందికరంగా అనిపించేదని ఈ విషయాన్ని ‘ఆర్మ్ ఛైర్ ఎక్స్‌పర్ట్’ అనే షోలో ఎమీలియా వెల్లడించారు. .

 

 

ఎందుకంటే అసలు ఆ సన్నివేశాల్లో నటించడానికి దుస్తులు విప్పాల్సిన అవసరం అస్సలు లేదు. కానీ ఎందుకు నాచేత అలా చేయించారో వారికే తెలియాలి. అలా నేను ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఫస్ట్ సీజన్‌లో నేను చాలా నగ్న సన్నివేశాల్లో నటించాను’ అని బాధపడుతూ తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి: