మెగాస్టార్ చిరంజీవికి తన కెరీర్లో ఎన్నో సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. ఎన్నో సినిమాలు ఆయన నటనకు, డాన్సులకు, ఫైట్లకు గీటు రాయిలుగా నిలిచాయి. ఇంత సాధించినా ఆయనకు ఓ ఫ్రీడం ఫైటర్ క్యారెక్టర్ చేయాలనే కలను నెరవేర్చుకోలేక పోయారు. మొత్తానికి ఆయన కల నెరవేర్చుకుంటూ డ్రీమ్ ప్రాజెక్ట్ గా చేసిన సైరా నరసింహారెడ్డి తెలుగులో ఘన విజయం సొంతం చేసుకుంది. ఈ సినిమా నేటితో 50 రోజులు పూర్తి చేసుకుని అర్థ శతదినోత్సవం జరుపుకుంటోంది.

 

 

ప్రస్తుతం ఓ సినిమాకు లాంగ్ రన్ చాలా  కష్టమైపోయింది. కలెక్షన్లే ప్రామాణికమైపోయిన ఈరోజుల్లో ఓ సినిమా 50 రోజులు ఆడితే పెద్ద హిట్ కింద లెక్క. దీంతో సైరా ఓ అరుదైన ఫీట్ సాధించినట్టే. హిందీ, తమిళ్ లో పెద్ద ప్రభావం చూపకపోయినా.. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. 64 ఏళ్ల వయసులో కూడా మెగాస్టార్ బాక్సాఫీస్ స్టామినా ఎంత శక్తివంతమైనదో నిరూపించింది. ఒక్క తెలుగులోనే 106 కోట్ల షేర్ సాధించి నాన్ బాహుబలి రికార్డ్స్ లో ఉన్న రామ్ చరణ్ రంగస్థలంను వెనక్కు నెట్టింది.  చిరంజీవికి ఇటువంటి రికార్డులు కొత్తేమీ కాదు. అయితే.. పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి పదేళ్ల గ్యాప్ తర్వాత కూడా ఈ స్థాయి హిట్ ఇవ్వటమే ఇక్కడ మెగాస్టార్ స్పెషల్.

 

 

రాష్ట్రంలోని 33 కేంద్రాలలో సైరా 50 రోజులు పూర్తి చేసుకుంది. భారతదేశ తొలి స్వాతంత్ర్య సమరయోధుడి పాత్రలో మెగాస్టార్ జీవించారనే చెప్పాలి. ఆయన మార్క్ పాటలు, డాన్సులు లేకపోయినా.. తెలుగుకు సరిపడని ట్రాజెడిక్ ఎండింగ్ ఉన్నా సైరా ఈ స్థాయి విజయం అందుకుందంటే మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్.. కథా బలమే కారణం. క్లైమాక్స్ లో చిరంజీవి నటన సినిమాకే హైలైట్ గా నిలిచింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: