టాలీవుడ్ క్రేజియస్ట్ హీరో రౌడీ అని ముద్దుగా అభిమానుల చేత పిలిపించుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే సినిమా చేస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని కె.ఎస్.రామారావు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పక్కన ముగ్గురు హీరోయిన్లు నటించడం విశేషం. అంతే కాకుండా ఈ సినిమా లో విజయ్ దేవరకొండ ముగ్గురు హీరోయిన్లతో ప్రేమలో పడతాడు అని ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్. ముగ్గురు హీరోయిన్లతో లవ్ ఫెయిల్ అవుతుందని దాంతో విజయ్ దేవరకొండ ఫుల్ నిరుత్సాహం లోకి డిప్రెషన్లోకి వెళ్తాడని ఇందువల్లనే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో  నిరుత్సాహంలో విజయ్ దేవరకొండ ఉన్నట్లు సినిమా యూనిట్ చూపించడం జరిగిందని చాలామంది ఇండస్ట్రీలో ఉన్న వారు అంటున్నారు. మొత్తంమీద చూసుకుంటే 'అర్జున్ రెడ్డి' సినిమాతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న యువతరాన్ని ఎంతో ఉత్సాహపరిచిన...విజయ్ దేవరకొండ  'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాతో మరొకసారి 'అర్జున్ రెడ్డి' సినిమా తరహాలోనే అలరిస్తాడని అర్థమవుతుంది.

 

అయితే ఈ సినిమా డిసెంబర్ నెలలో విడుదల చేయాలని భావించారు సినిమా యూనిట్. అయితే ప్రస్తుతం వస్తున్న వార్తలను బట్టి చూస్తే ఈ సినిమాని వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసంలో ప్రేమికుల రోజు అనగా ఫిబ్రవరి 14వ తారీఖున విడుదల చేయాలని సినిమా యూనిట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో రౌడీగా లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ రాబోయే ప్రేమికుల రోజు నాడు ఎంతటి ప్రభంజనాన్ని సృష్టిస్తాడో చూడాలి.

 

ముఖ్యంగా టైటిల్ విషయంలోనే సినిమాకి సంబంధించి క్లారిటీ ఇవ్వడంతో చాలా మంది సినిమా ప్రేమికులు మరియు విజయ్ దేవరకొండ అభిమానులు రాబోయే వాలెంటెన్స్ డే కోసం సినిమా చూడటానికి ఇప్పటి నుండే ఎంతో ఆసక్తి చూపిస్తున్నట్లు సోషల్ మీడియాలో వచ్చిన ఈ వార్తకు వారు చేసిన కామెంట్లు బట్టి తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: