ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రముఖుల ఇళ్లలో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. తాజాగా ఈరోజు ఉదయం నుండి హైదరాబాదు నగరంలో ఉన్న చాలా మంది ప్రముఖుల ఇళ్లలో రామోజీ ఫిలిం సిటీలో అలాగే హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రముఖ డైరెక్టర్లు నిర్మాతలు హీరోల ఇంటిలో ఐటీ అధికారులు ఒక్కసారిగా సోదాలు చేపట్టడంతో ఈ వార్త ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది. దీంతో ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న మీడియా ఈ వార్తని హైలెట్ గా చేస్తూ కథనాలు మీద కథనాలు ప్రసారం చేస్తోంది.

 

అయితే ఐటి అధికారులు ఐటీ సోదాలు ఒక్కసారి పది చోట్ల సోదాలు నిర్వహించడం బిగ్ బ్రేకింగ్ న్యూస్ గా మారింది. రామానాయుడు స్టూడియోతో పాటు సురేష్ ప్రొడక్షన్ కార్యాలయంలో ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తుండగా.. ఇటు, టాలీవుడు నేచురల్ స్టార్ నాని ఇంట్లోనూ ఐటీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్ లోని హీరో నాని ఇంట్లో, కార్యాలయంలోనూ ఏక కాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

 

ఇటీవల నాని జెర్సీ సినిమా తో సూపర్ డూపర్ హిట్టు అందుకున్న తర్వాత గ్యాంగ్ లీడర్ సినిమా చేయడం జరిగింది. అయితే గ్యాంగ్ లీడర్ సినిమా దారుణంగా ఫ్లాప్ కావడంతో...ప్రస్తుతం తనని హీరోగా పరిచయం చేసిన డైరెక్టర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఐటీ సోదాలు ఒక్కసారిగా నాని ఇంటిలో మరియు కార్యాలయంలో సోదాలు నిర్వహించడంతో ఈ విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో అదేవిధంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంకా ఐటీ అధికారులు హైదరాబాద్ నగరంలో ఉన్న మరికొంతమంది ఇళ్లపై కార్యాలయాలపై సోదాలు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: