ప్రముఖ టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ వారి ఆఫీసుల పై నేడు కాసేపటి క్రితం ఇన్కమ్ టాక్స్ అధికారుల దాడులు జరిగాయి. దగ్గుబాటి రామానాయుడు గారు స్థాపించిన ఈ సంస్థ ద్వారా తొలిసారిగా ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేసిన రాముడు భీముడు సినిమా తెరకెక్కడం జరిగింది. ఇక అప్పటినుండి ప్రారంభం అయిన ఈ సంస్థ ప్రస్థానం, ఇప్పటికీ విజయవంతంగా కొనసాగుతూనే ఉంది. ఇక ఇటీవల నిర్మాత రామానాయుడు గారి మరణం తరువాత ఆ సంస్థను ఆయన పెద్ద తనయుడు సురేష్ బాబు నిర్వహిస్తూ పలు సక్సెస్ఫుల్ సినిమాలు నిర్మిస్తున్నారు. 

 

ఇకపోతే నేటి దాడుల సమయంలో ముందుగా సురేష్ బాబు ఇంటిని, తరువాత రామానాయుడు స్టూడియోస్, ఆఫీసులు సహా మొత్తం పది ప్రదేశాల్లో ఐటి వారు సోదాలు నిర్వహించినట్లు సమాచారం. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ద్వారా సినిమాలు నిర్మిస్తుండడంతో పాటు, తమ సంస్థపై పలు సినిమాలు కూడా పంపిణీ చేయడం, అలానే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో  సినిమా థియేటర్లను కూడా కలిగి ఉన్నారు సురేష్ బాబు. 

 

అయితే దాడుల సమయంలో అధికారులు కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ, అవి ఎటువంటివి అనేది మాత్రం తెలియరాలేదు. కాగా ప్రస్తుతం ఈ వార్త పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇకపోతే ప్రస్తుతం వెంకటేష్, నాగచైతన్యల కలయికలో తెరకెక్కుతున్న వెంకీ మామ సినిమాతో పాటు అతి త్వరలో వెంకటేష్ హీరోగా తెరకెక్కనున్న అసురన్ రీమేక్ ని కూడా ఇదే సంస్థ నిర్మిస్తోంది. గతంలో మైత్రి మూవీ మేకర్స్‌, దిల్‌ రాజు, కెఎల్‌ నారాయణ నివాసాలు, కార్యాలయాల్లోనూ ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ విధముగా వరుస ఐటీ దాడులతో టాలీవుడ్‌ నిర్మాతలు కొంత కంగారుపడుతున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: