బహుబలికి ముందు పరిస్థితి ఎలా ఉన్నా ఆ సినిమా వచ్చిన తర్వాతనే మన హీరోలకు మంచి డిమాండ్ పెరిగింది. బాహుబలి తర్వాత తెలుగు సినిమాల పరిధి కూడా పెరగడంతో ఇక్కడ హిట్టైన సినిమాలను బాలీవుడ్ లో కూడా రీమేక్ చేస్తున్నారు. అర్జున్ రెడ్డి అక్కడ కబీర్ సింగ్ గా రీమేక్ చేసి హిట్టు కొట్టారు. ఇప్పుడు నాని జెర్సీ కూడా బాలీవుడ్ లో రీమేక్ అవుతుంది.

 

ఆ సినిమాల వల్ల తెలుగు హీరోలకు కూడా నేషనల్ వైడ్ గా క్రేజ్ పెరిగింది. ముఖ్యంగా తెలుగులో మోస్ట ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అయిన ప్రభాస్, రానా, విజయ్ దేవరకొండ, అఖిల్ వంటి స్టార్స్ కు అమ్మయిల్లో బీభత్సమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రభాస్ పెళ్లికి రెడీ అవుతుండగా రానా తన మ్యారేజ్ కు ఇంకా టైం ఉందని చెబుతున్నాడు.  

 

అయితే ఇక రేసులో ఉన్న విజయ్ దేవరకొండ, అఖిల్ లకు మాత్రం మనసులు రాసిచ్చేస్తున్నారు అందమైన అమ్మాయిలు. తెలుగులో క్రేజీ స్టార్స్ గా అవతరించిన విజయ్ దేవరకొండకు అమ్మాయిల్లో క్రేజీ ఫాలోయింగ్ ఉంది. మనసులో ఎలాంటి భేషజాలు లేకుండా మైండ్ లో ఏముందో అది చెబుతూ రౌడీ ఇమేజ్ తెచ్చుకున్న విజయ్ అంటే లేడీ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు.

 

ఇక అక్కినేని నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ కు అమ్మాయిల్లో భారీ ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ హీరో ఇప్పటివరకు ఒక్క హిట్టు కొట్టకున్నా సరే మన్మథుడి వారసుడిగా లేడీ ఫ్యాన్స్ పెరుగుతూ వచ్చారు. అయితే బ్యాచిలర్ హీరోలకే కాదు ఆల్రెడీ పెళ్లైన మహేష్, చరణ్, ఎన్.టి.ఆర్ లకు మంచి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మహేష్ బాబు పెళ్లయ్యింది కాని అతని ప్రేమలో పడేందుకు ఎంతమంది రెడీగా ఉన్నారో ఊహించడం కష్టమే. మొత్తానికి తెలుగు హీరోల క్రేజీ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో మిగతా భాషల హీరోలకు షాక్ ఇస్తున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: