టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ. అప్పటివరకు సాదాసీదా హీరోగా ఉన్న విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి గీత గోవింద సినిమాలతో స్టార్ హీరోగా మారిపోయాడు. ఇప్పుడు యూత్ ఐకాన్ గా మారిపోయాడు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ వారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ. చూడ్డానికి అటుఇటుగా కాస్త విజయ్ దేవరకొండ లాగానే ఉండే ఆనంద్  దేవరకొండ దొరసాని సినిమాతో టాలీవుడ్ హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అనుకున్నాడు ఆనంద్ దేవరకొండ. మొదటి సినిమాతోనే ఆనంద్ దేవరకొండ తాను కమర్షియల్ సినిమాల హీరో ని కాదని భిన్నమైన కథ లకు కేరాఫ్ అడ్రస్ అంటూ ప్రూవ్ చేసుకున్నాడు. 

 

 

 

 తన మొదటి సినిమానే ఓ కొత్త ప్రయోగం తో మొదలుపెట్టాడు ఆనంద్ దేవరకొండ. అయితే విజయ్ దేవరకొండ తమ్ముడు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు అంటే ఇంకో అర్జున్ రెడ్డి సినిమాను ప్రేక్షకులు అతనీనుంచి  చేయడం కామన్ . కానీ అతను మాత్రం విభిన్నమైన కథలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా అంటూ మొదటి సినిమాతోనే ప్రూవ్ చేసుకున్నాడు. భిన్నమైన కథ నేపథ్యంతో మొదటి సినిమాలోనే మంచి విజయాన్ని అందుకున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ నటనకు మంచి మార్కులు కూడా పడ్డాయి. పరువు హత్య నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ హీరో తాజాగా మరో పాత సినిమా రీమేక్ లో నటించబోతున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. 1997లో శ్రీకాంత్ హీరోగా నటించిన తాళి సినిమా రీమేక్ చేసే పనిలో పడ్డారట ఆనంద్ దేవరకొండ. 

 

 

 

 దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన తాళి సినిమా  మంచి విజయాన్ని అందుకున్నది. అయితే ఈ సినిమా కథ కథనాల్లో ఈ జనరేషన్ కు తగ్గట్టుగా మార్పులు చేసి దేవరకొండ ఈ సినిమాలో నటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఆనంద్ దేవరకొండకు  ఈ కథ వినిపించగా నచ్చడంతో ఓకే చేసినట్లు సమాచారం. కాగా ఈ సినిమాను  ఏ దర్శకుడు  తెరకెక్కించబోతున్నాడు అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. మొదటి సినిమాతోనే తాను ఒక మంచి నటుడిని అంటూ ప్రూవ్  చేసుకునే విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు ఆనంద్ దేవరకొండ... మరో పాత సినిమాను రీమేక్ చేస్తూ ప్రయోగం చేస్తుండడంతో ఈ ప్రయోగంతో  ఆనంద్ దేవరకొండ  ఎలాంటి హిట్  అనుకుంటారో  చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: