మణిశర్మ కెరీర్ యూటర్స్ తీసుకుంది. ఇస్మార్ట్ శంకర్ లాంటి మ్యూజికల్ హిట్ ఇచ్చినా.. పెద్ద సినిమా రాలేదు. మణిశర్మను పట్టించుకోవడం మానేశారన్న కామెంట్స్ వినిపించాయి. కాస్త లేటైనా... లేటెస్ట్ గా అదిరిపోయే ఛాన్స్ కొట్టేశాడు మణిశర్మ. ఓ టాప్ హీరోతో మల్లీ వర్క్ చేయనున్నాడట. ఇంతకీ మణిశర్మకు ఛాన్స్ ఇచ్చిన ఆస్టార్ ఎవరో తెలుసా..?

 

దేవీశ్రీ.. తమన్ కు స్టార్ డమ్ రాకముందే మణిశర్మ తెలుగు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపారు. ఈ మ్యూజిక్ డైరక్టర్ డేట్స్ కోసం స్టార్స్ ఎదురుచూసిన రోజులున్నాయి. ఆ మధ్య వరుస ఫ్లాపులు రావడంతో వెనకుబడిపోయిన మణిశర్మ ఇస్టార్ట్ శంకర్ తో ఫామ్ లోకి వచ్చారు. ఇస్మార్ట్ ఘన విజయంలో మణిశర్మ రోల్ పెద్దదే. 

 

ఇస్మార్ట్ శంకర్.. మణిశర్మకు అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. ఏకంగా మెగాస్టార్ సినిమాకే మ్యూజిక్ అందించనున్నాడు మణిశర్మ. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇప్పటి వరకు 10సినిమాలొచ్చాయి. సూపర్ హీరోస్ మూవీస్ తో సంగీత దర్శకుడిగా పరిచయమైన మణిశర్మ.. చిరంజీవికి ఇచ్చిన వరుస హిట్స్ స్టార్ డమ్ తీసుకొచ్చాయి. ఈ కాంబినేషన్ లో బావగారు బాగున్నారా.. చూడాలని ఉంది.. అన్నయ్య.. ఇంద్ర.. ఠాగూర్.. లాంటి మ్యూజిక్ హిట్స్ ఉన్నాయి. 

 

సైరా తర్వాత చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నాడు. షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైనా.. రెగ్యులర్ షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. కొరటాల ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ వర్క్ చేయడం లేదు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ పేర్లు వినిపించినా.. ఒక్కసారిగా మణిశర్మ పేరు తెరపైకి వచ్చింది. ఈ పేరు ఇంకా ఎనౌన్స్ చేయకపోయినా.. ఆల్ రెడీ ఫిక్స్ అయిందట. స్టాలిన్ తర్వాత మరోసారి ఈ హిట్ కాంబినేషన్ వర్కవుట్ అవ్వడమే కాదు.. చాలా సంవత్సరాల తర్వాత మణి వర్క్ చేస్తున్న స్టార్ హీరో మెగాస్టారే అవుతాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: