గేమింగ్, యానిమేష‌న్ లాంటివి ఎంట‌ర్‌టైన్మెంట్ రంగంలో పెద్ద పీట వేసుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా వీఎఫ్ఎక్స్‌, గేమింగ్‌, యానిమేష‌న్ రంగంలో కోట్లాది రూపాయ‌ల వ్యాపారం జ‌రుగుతోంది. హెచ్ఐసీసీలో జ‌రిగిన ఇండియా జాయ్ కార్య‌క్ర‌మాన్నిరాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి ప‌లువురు సినీ ప్ర‌ముఖ‌లు హాజ‌ర‌యి విజ‌య‌వంతం చేశారు. న‌టి న‌మ్ర‌త‌, ప్ర‌ముఖ నిర్మాత అల్లుఅర‌వింద్‌, ద‌ర్శ‌కుడు వంశీపైడిప‌ల్లి త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. నాలుగురోజుల పాటు జ‌ర‌గ‌నున్న ఈ కార్య‌క్ర‌మంలో కేటీఆర్ మాట్లాడారు.

 

ప్ర‌పంచ‌స్ధాయి స్టూడియోల‌న్నీ హైద‌రాబాద్‌లోనే ఉన్నాయి. చిత్ర ప‌రిశ్ర‌మ‌కు హైద‌రాబాద్ చ‌క్క‌ని వేదిక‌గా మారింది. యానిమేష‌న్ వ‌చ్చిన త‌ర్వాత మూవీ మేకింగ్ లో చాలా అద్భుత‌మైన మార్పులు వ‌చ్చాయి. సిని రంగం మ‌రో స్థాయిలో ఉంది. సినిమా రంగంలో వీఎఫ్ఎక్స్ కీల‌క పాత్ర‌ని పోషిస్తుంది. బాహుబ‌లి, ఈగ‌, మ‌గ‌ధీర వంటి చిత్రాల‌న్నీ కూడా యానిమేష‌న్‌, వీఎఫ్ ఎక్స్ ఎఫెక్ట్స్ బాగా క‌నిపిస్తాయి.  సినిమా రంగాన్ని ఎంతో ప్ర‌భావితం చేసింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంతో మంది బిలియ‌న్ యాక్టివ్ గేమ‌ర్లు ఉన్నారు. ఏడాదికి 25శాతం గేమింగ్ ఇండ‌స్ట్రీని అభివృద్ధి చేస్తోంది. గేమింగ్ విభాగం నుంచి 250కోట్లు ఆదాయం ఉండ‌గా.. ఇది 2020 సంవ‌త్స‌రం వ‌ర‌కు మూడు రెట్లు పెరిగే అవ‌కాశం ఉంద‌ని అనుకుంటున్నాము.

 

ఓటీటీ బ్రాడ్‌క‌స్ట‌ర్ వంటి లోక‌ల్ భాష‌ల్లో కంటెంట్ అందిస్తోంది. చోట భీమ్ అందుకు మంచి ఉదాహ‌ర‌ణ‌. న‌గ‌రంలో రూ. 1000 కోట్ల పెట్టు ఏబిలో ఇమేజ్ ట‌వ‌ర్స్ ఏర్పాటు చేస్తున్నాము. మ‌రో రెండు సంవ‌త్స‌రాల్లో ఇమేజ్ ట‌వ‌ర్స్ ప్రారంభ‌మ‌వుతాయి. ఏవీజీసీని విద్యార్ధుల‌కు ఇదొక స‌బ్జెక్ట్‌గా అందించాల‌ని అనుకుంటున్నాము. అదే విధంగా గేమింగ్  అండ్ ఇండ‌స్ట్రీ అభివృద్ధి మ‌రియు ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇండ‌స్ట్రీకి స‌బ్జిడీలు ప్ర‌క‌టించ‌బోతున్నాము. ఇండియా జాయ్ ద్వారా గేమింగ్ మ‌రియు మీడియా సెక్టార్‌ని కూడా ప్ర‌మోట్ చేయ‌నున్నాము. యానిమేష‌న్‌, గేమింగ్ ఇండ‌స్ట్రీకి చ‌క్క‌ని డెస్టినేష‌న్ తెలంగాణ అవుతుంది అని కేసీఆర్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: