జూనియర్ ఎన్టీఆర్... నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి టాప్ హీరోల రేస్  లో కొనసాగుతున్న హీరో.? ఎలాంటి పాత్రలోనైనా నట విశ్వరూపాన్ని చూపించి  ప్రేక్షకులను ఔరా అనిపించగల  సత్తా ఉన్న హీరో జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే... అందులో తన విశ్వరూపం కనిపించడం కాయం  అని అనుకుంటారు అందరు. జూనియర్ ఎన్టీఆర్ కు టాలీవుడ్ లో ఎంతో క్రెజ్ ఉంది . అటు నందమూరి అభిమానులే ఈ  హీరో నటనకి మిగతా హీరోల అభిమానులు కూడా ఫిదా అయిపోతారు. అయితే మొన్న విడుదలైన ఎన్టీఆర్ బయోపిక్ మహానాయకుడు కథానాయకుడు సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటించిన ఉంటే ఇంకా బాగుండేది అని ఎంతో మంది భావించిన విషయం తెలిసిందే. నందమూరి అభిమానులు అందరికీ జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తే  చూడాలన్నది ఒక చిరకాల వాంఛ. 

 

 

 

 అప్పుడెప్పుడో  రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన యమదొంగ సినిమాలో... జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ ఒక తెర మీద కనిపించేలా గ్రాఫిక్స్ తో  ఒక స్టేజ్ పై ఇద్దరు ఎన్టీఆర్ లతో స్టెప్పులు వేయించారు రాజమౌళి. కాగా  సీనియర్ ఎన్టీఆర్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తే ఇక నందమూరి అభిమానులకు పండగే. కానీ ఒకవేళ అలాంటి ఛాన్స్ వస్తే ఎన్టీఆర్ నటిస్తారా అని కూడా ఒక అనుమానమే . కానీ ఒకవేళ ఛాన్స్ వస్తే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ తాతగారు సీనియర్ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తే  మాత్రం అది నందమూరి అభిమానులకు ఒక పెద్ద గిఫ్ట్ గా చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయం కోసం నందమూరి అభిమానులు కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. 

 

 

 

 అయితే ప్రస్తుతం నందమూరి అభిమానుల కోరిక నెరవేరినట్లే కనిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్... అన్న గారు సీనియర్ ఎన్టీఆర్ పాత్రలో నటించబోతున్నారు అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తమిళనాడు దివంగత సీఎం జయలలిత జీవిత చరిత్ర తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కాగా  ఈ సినిమాలో  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నట్లు సమాచారం.? కాకా ఇప్పటికే జయలలిత బయోపిక్ తెరకెక్కిస్తున్న చిత్రబృందం జూ  ఎన్టీఆర్ ను  సంప్రదించినట్లు తెలుస్తోంది. కాగా తారక్ నిర్ణయం కోసం చిత్ర బృందం వేచి చూస్తున్నట్లు సమాచారం. దక్షిణాదితో  పాటు హిందీలో కూడా విడుదల కాబోయే ఈ సినిమాలో జయలలిత పాత్రలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటిస్తుండగా ఎన్టీఆర్ పాత్రలో అరవిందస్వామి నటిస్తున్నారు. ఒకవేళ ఈ సినిమాలు సీనియర్ ఎన్టీఆర్ పాత్రలో  జూనియర్ ఎన్టీఆర్ నటిస్తే అది నందమూరి అభిమానులకు పండగే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: