ప్రముఖ హాలీవుడ్ నటి ప్రిన్సెస్ లవ్ తన భర్త పై సంచలన వ్యాఖ్యలు చేసింది. గర్భిణి అని కూడా చూడకుండా తనను వదిలి వెళ్లిపోయాడని అరోపించింది. 35 ఏళ్ల ప్రిన్సెస్ సింగర్ రేజేను పెళ్లి చేసుకుంది. వీరికి ఒక పాప కూడా ఉంది. ప్రస్తుతం ఆమె ఎనిమిది నెలల గర్భిణి. అయితే నవంబర్ 17న లాస్ వెగాస్‌లో జరిగిన బెట్ సౌల్ ట్రెయిన్ అవార్డ్స్ వేడుకకు ప్రిన్సెస్‌ని తన కూతురిని వెంట తీసుకుని వెళ్లాడు రేజే. షో అయిపోయాక రేజే భార్యాపిల్లల్ని వదిలేసి వెళ్లిపోనట్లు తెలిపింది. దాంతో ప్రిన్సెస్ తన కుమార్తెతో కలిసి లాస్ వెగాస్‌లోనే ఉండిపోయింది. ఇంతటి నీచమైన భర్తను నేనెక్కడా చూడలేదంటూ ఈ విషయాన్ని ప్రిన్సెస్ ఇన్స్టాగ్రామ్ ద్వారా తన ఆవేదనను వెల్లడించింది.
‘గర్భిణి అన్న జాలి కూడా లేకుండా తనను, తన కూతురిని వదిలేసి వెళ్లిపోయాడని ఆవేదన చెందింది. ఫోన్ చేస్తే నెంబర్ కలవకుండా బ్లాక్‌లో పెట్టేశాడు. ఇంతటి అసహ్యమైన వ్యక్తికి గుడ్ బై చెప్పకపోతే బాగోదు. నేను నా బిడ్డను తీసుకుని ఇంటికి వెళ్లగలిగే స్థితిలో ఉన్నాను నా దగ్గర డబ్బులు ఉన్నాయి. కానీ నేను కారును నడపలేను. ఎందుకంటే నాకు ఇప్పుడు ఎనిమిది నెలలు. కారు మధ్యలో ఆగిపోతే డీజిల్ పోయించుకోవడానికి గ్యాస్ కొట్టించుకోవడానికి ఆపలేను. ఈ సమయంలో కారు నడిపితే పురిటి నొప్పులు వస్తాయి. అవన్నీ నేను భరించలేను. కాబట్టి ఓ డ్రైవర్ని మాట్లాడుకుని వెళ్తాను’ అని తెలిపింది. అయితే ప్రిన్సెస్ చేస్తున్న ఆరోపణలపై రేజే ఏమీ స్పందించలేదు. అయితే అవార్డ్స్ షోలో వీరిద్దరూ కౌగిలించుకుంటూ ఫొటోలకు ఫోజులిస్తూ కనిపించారు. ఇంతలో ఏం జరిగిందో వారికే తెలియాలి. అయినా ఇలాంటివన్నీ సినిమావాళ్ళకి మామూలే ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో వారికే తెలియవు. వారి సంబంధాలు అలానే ఉంటాయి. ఎంత త్వరగా కలుస్తారో అంతే త్వరగా విడిపోతారు.