కత్తి మహేష్... సినిమా విమర్శకుడు   కత్తి మహేష్ ఎన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్నారు. కత్తి మహేష్ ఎంతోమందిని కామెంట్ చేసి  ఎన్నో వివాదాలను  ఎదుర్కున్నారు  కూడా. పవన్ కళ్యాణ్ ని కామెంట్ చేయడం ద్వారా ఒక్కసారిగా తెరమీదకు వచ్చారు కత్తి మహేష్. అప్పుడు వరకు కొంత మంది తెలుగు ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన కత్తి మహేష్ పేరు పవన్ కళ్యాణ్ ను  విమర్శించడంతో ఒక్కసారిగా తెర మీదికి వచ్చి సంచలనం సృష్టించారు . పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కత్తి మహేష్ కి వార్నింగ్ ల మీద  వార్నింగ్ కూడా ఇచ్చారు. అంతేకాకుండా కత్తి మహేష్ తన నోటి దురుసు వల్ల ఆరు నెలలు నగర బహిష్కరణ కూడా ఎదుర్కొన్నారు. ఎప్పుడు కత్తి మహేష్ ఏదో ఒక వివాదంలో తెరమీద కనిపిస్తూనే ఉంటారు. 

 

 

 

కత్తి మహేష్ కి సంబంధించి  గత కొంత కాలంగా కొన్ని వార్తలు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే.సినిమా  విమర్శకుడు అయిన కత్తి మహేష్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడు అని వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఏపీలో అధికార వైసీపీలో చేరుతారంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటివరకు కత్తి మహేష్ మాత్రం వైసీపీలో చేరలేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కత్తి మహేష్  ఈ  ప్రశ్నే  ఎదురయింది. మీరు వైసీపీలో చేరబోతున్నారా గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి ఇది నిజమేన అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకి కత్తి మహేష్ ఆసక్తికర సమాధానం చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీ నుంచి తాను అసెంబ్లీ టిక్కెట్ ఆశించానని  కత్తి మహేష్ తెలిపారు. వైసిపి పార్టీ  నుండి అసెంబ్లీ టికెట్ కోసం చాలా ప్రయత్నాలు కూడా చేశానని కత్తి మహేష్  తెలిపారు. 

 

 

 

 కానీ అప్పట్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా తనకు వైసీపీ పార్టీ నుంచి అసెంబ్లీ టిక్కెట్లు ఇవ్వడం సాధ్యపడలేదని చెప్పుకొచ్చారు. ఒకవేళ తనకు 2019 ఎన్నికలప్పుడే అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చి ఉంటే తాను కచ్చితంగా వైసీపీ కండువా కప్పుకున్న వాడిని అని  కత్తి మహేష్ అన్నారు . ఎప్పటికైనా క్రియాశీలక రాజకీయాల్లో తాను రాణించాలని కోరిక తనకు ఉందని తనకు రాజకీయాల పైన ఆసక్తి పై క్లారిటీ ఇచ్చారు. కనీసం వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ నుంచి తనకు టిక్కెట్ ఇస్తానంటే ఖచ్చితంగా వైసీపీ పార్టీలో చేరుతారంటూ కత్తి మహేష్ తెలిపారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం కత్తి మహేష్ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో నటించగా..  ఈ సినిమా త్వరలో విడుదల కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: