భారత రత్న అంటే దేశంలో అత్యున్నతమైన పౌర పురస్కారం. ఆ పురస్కారం బతికి ఉన్న వారికి దక్కింది. మరణానంతరం  చాలా మందికి దక్కింది.. కాంగ్రెస్ ఏలుబడిలో తమ  భావజాలానికి దగ్గరగా ఉన్న వారిని ఎంపిక చేశారని విమర్శలు వచ్చాయి. ఇక బీజేపీ హయాంలో  ఆరెసెస్ భావజాలంలో దేశానికి సేవలు అందించిన వారికి గుర్తించి మరీ గౌరవించారు 

 


ఇక అతి పిన్న వయసులో అంటే నలభై పడిలోనే క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కి భారత రత్న పురస్కారం లభించింది. ఇక రాజకీయ నాయకుల్లో కూడా అనేక మందికి దక్కింది. అలాంటివారిలో చూసుకుంటే రాజీవ్ గాంధి ఒకరు. ఇక ప్రాంతీయ నేతల్లో తమిళనాడు గడప దాటకుండా రాజకీయంగా విశేషంగా జనాభిమానం కలిగిన ఎమ్జీయార్ కి భారత రత్న మరణానంతరం ఇచ్చారు. అప్పట్లో తమిళనాట అన్నాడీఎంకేతో పొత్తు కోసం ఇలా చేశారని రాజకీయ విమర్శలు కూడా వచ్చాయి.

 

సరే ఎంతమందికి అవార్డు వచ్చిన తెలుగు వారి వద్దకు వచ్చేసరికి తీరని అన్యాయమే జరిగిందని చెప్పుకోవాలి. సంగీత స్రష్ట డాక్టర్ మంగళంపల్లి బాలమురళీక్రిష్ణకు ఈ ఆవార్డ్ రాకపోవడం అందరికీ షాక్ లాంటిదే. ఇక మరెంతో మంది తెలుగు తేజాలు భారత రత్నకు నోచుకోలేదు. ఆ అవార్డ్ కి నందమూరి తారక రామారావు అర్హుడు అనడంలో ఎవరికీ సందేహాలు లేవు. ఎందుకంటే అన్న గారు సినిమారంగంలో విశ్వ విఖ్యాతి గాంచిన సార్వభౌముడు. ఇక రాజకీయాల్లో కూడా దేశాన్ని ఒక కుదుపు కుదిపిన నాయకుడు. నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఆయన కేంద్రంలో మళ్ళీ అప్పటికి  పదేళ్ళకు కాంగ్రెసేతర‌ సర్కార్ ఆవిర్భావానికి క్రుషి చేసిన నేత. 

 

జాతీయ నాయకులందరినీ ఏకం చేసిన సమ్మొహనశక్తి. ఇక  అన్నగారు మూడు సార్లు బంపర్ మెజారితో ముఖ్యమంత్రి అయ్య్యారు. రాజకీయాలకు కొత్త అర్ధం చెప్పారు. దేశంలో రాజకీయాలను కీలకమైన మలుపు తిప్పారు. అటువంటి అన్న గారికి భారత రత్న రావాలని ప్రతి ఒక్క ఎన్టీయార్ అభిమాని మాత్రమే కాదు, తెలుగు వారంతా కోరుకుంటారు. దీని మీద ఇటీవల ఆయన సతీమణి లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ తనకు తీరని కోరికలు రెండు ఉన్నాయని చెప్పారు.

 

వాటిలో  ఒకటి ఎన్టీయార్ కి భారత రత్న అవార్డ్, మరొకటి ఆయన పేరు మీద జిల్లా ఏర్పాటు. మరి రెండవది  జగన్ చేస్తారన్న నమ్మకం ఉందన్న లక్ష్మీ పార్వతి. మొదటిది కూడా తీరాలను కోరుకుంటున్నారు. మరి అక్కడ ఉన్నది మోడీ సర్కార్. ఎన్టీయార్ కి భారత రత్న  ఇస్తారా.

మరింత సమాచారం తెలుసుకోండి: