టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. తెలుగు ప్రేక్షకులందరిని  కడుపుబ్బా నవ్వించే టీవీలకు కట్టిపడేస్తుంది. అయితే జబర్దస్త్ షో ఎంతో మందికి లైఫ్ నిలిచిందని చెప్పాలి. జబర్దస్త్ షో లోకి వచ్చిన వాళ్ళు ఎంతో ఫేమ్ సంపాదించుకున్నారు. ఏకంగా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి కామెడీ చేసిన కమెడియన్స్ సినిమాలో హీరోగా మారిపోయిన వారు కూడా ఉన్నారు. అందుకే జబర్దస్త్ కు ఒక్కసారి ఎంట్రీ ఇస్తే చాలు తమ లైఫ్ మారిపోతుంది అనుకుంటుంటారు కమెడియన్స్. ఆ రేంజ్ లో పాపులర్ అయింది  జబర్దస్త్ షో. జబర్దస్త్ షో లో ప్రతి వారం స్కిట్ లో కొత్తదనం చూపిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నారు కమెడియన్స్. జబర్దస్త్ షో లో జడ్జ్ లు  ప్రత్యేకం. జబర్దస్త్ జడ్జ్ ల  నవ్వుల వల్ల కూడా జబర్దస్త్ షో కి అంత ఫెమ్  వచ్చింది అనడంలో అతిశయోక్తి  లేదు .మెగా  బ్రదర్ నాగబాబు జబర్దస్త్ షోలో జడ్జ్ గా  అవతారమెత్తి తన నవ్వులతో నవ్వుల  రారాజుగా మారిపోయారు. 

 

 

 

 ఇదిలా ఉండగా జబర్దస్త్ షో గురించి గత కొన్ని రోజులుగా ఓ వార్త హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. జబర్దస్త్ షో నుంచి బాగా పాపులరైన టీం లీడర్లు చమ్మక్ చంద్ర,  హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ టీం లు  బయటకు వస్తున్నాయని అంతేకాకుండా జబర్దస్త్ జడ్జ్ నాగబాబు కూడా జబర్దస్త్ నుంచి తప్పుకుంటున్నట్టు గతకొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా జబర్దస్త్ షో మొదలైనప్పటి నుంచి యాంకర్ గా ఉన్న అనసూయ కూడా జబర్దస్త్ విడిచి వెళ్ళిపోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై చమ్మక్ చంద్ర కూడా తాను తప్పుకుంటున్నట్టు తెలిపిన విషయం తెలిసిందే. అయితే జబర్దస్త్ షో లో యాంకర్ గా ఉన్న అనసూయ భరద్వాజ్ తప్పుకుంటే ఆ స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారని దానిపై  ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. రష్మీ తో నే జబర్దస్త్ షో ని కూడా నడిపిస్తారా...లేక కొత్త యాంకర్ ని తీసుకున్నారా అనే దానిపై కూడా మరో చర్చ మొదలైంది. 

 

 

 

 అయితే జబర్దస్త్ లో  ఎంట్రీ ఇచ్చిన అనసూయ భరద్వాజ్  ఈ షో ద్వారానే ఎక్కువ పాపులర్ అయింది... ఈ షో ద్వారానే సినిమా అవకాశాలు అందుకుంది...  జబర్దస్త్ షో ద్వారా నటిగా హీరోయిన్ గా ఎదిగింది. అయితే ప్రస్తుతం జబర్దస్త్ షో అనసూయ భరద్వాజ్ తప్పుకుంటున్నట్లు వార్తలు రావడంతో... జబర్దస్త్ షో కి యాంకర్ గా శ్రీముఖి ని సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంలో మల్లెమాల యాజమాన్యం ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే మొదట్లోనే జబర్దస్త్ షో కి యాంకర్ గా శ్రీముఖి అవకాశం వచ్చినప్పటికీ శ్రీముఖి జబర్దస్త్ కమెడియన్స్ వేసే పంచులను  తట్టుకోలేనని  చెప్పి ఈ అవకాశాన్ని రిజెక్ట్ చేసింది... కానీ ఇప్పుడు శ్రీముఖి యాంకరింగ్ బాగా రాటుదేలింది  కాబట్టి మరోసారి అవకాశం రావడంతో జబర్దస్త్ యాంకరింగ్ చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. మరీ జబర్దస్త్ లో అనసూయ భరద్వాజ్ కు బదులు శ్రీముఖి యాంకరింగ్ చేయబోతోందని వార్త నిజం అవుతుందో లేదో చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: