ప్రస్తుతం భారతీయ చలన చిత్ర రంగంలో బయోపిక్ ల పర్వం కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీ రామారావు జీవిత చరిత్రకు సంబంధించి బయోపిక్ అదేవిధంగా వైసిపి పార్టీ అధ్యక్షుడు ఏపీ సీఎం జగన్ తండ్రి అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి రాజకీయ జీవితానికి సంబంధించి యాత్ర అనే సినిమా రావడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో తాజాగా తమిళ రాజకీయాలను శాసించే తమిళులు చేత అమ్మ అని పిలిపించుకున్న దివంగత జయలలిత జీవితానికి సంబంధించి “తలైవి” అనే సినిమా వస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే. ఈ సినిమాలో జయలలిత పాత్రలో బాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ కంగనా రనౌత్ నటిస్తోంది.

 

ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం కంగనా రనౌత్ తమిళ భాష మరియు భరతనాట్యం ప్రస్తుతం నేర్చుకునే పనిలో నిమగ్నమైంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు మొదలైన నేపథ్యంలో తాజాగా ఈ సినిమా లో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో తన తాత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన నందమూరి తారక రామారావు క్యారెక్టర్ చేస్తున్నట్లు సమాచారం.

 

అయితే ప్రస్తుతం ఆ పాత్రకు సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ తో “తలైవి” సినిమా యూనిట్...చర్చిస్తున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. అయితే గతంలో జూనియర్ ఎన్టీఆర్ కు రామారావు గారి పాత్రలో నటించాలని చాలా అవకాశాలు వచ్చిన సందర్భంలో తాత పాత్రలో నటించడానికి అంత సాహసం చేయలేదు. ఇటువంటి నేపథ్యంలో “తలైవి” సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తన తాత నందమూరి తారక రామారావు క్యారెక్టర్ చేస్తారో లేదో అన్న టెన్షన్ ప్రతి ఒక్కరిలో నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: