నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం 'రూలర్' అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చివరిదశలో ఉన్న నేపథ్యంలో డిసెంబర్ నెలలో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న తరుణంలో 'రూలర్' సినిమా గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణ నటనలో ఎన్నడూ చేయని విధంగా అద్భుతమైన నటన కనబరిచారు అని సింహా, లెజెండ్ టైప్ విజయం ఈ సినిమాతో సాధిస్తారని కచ్చితంగా 'రూలర్' సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ ని శాసిస్తుంది అని అంటున్నారు సినిమా యూనిట్ కి చెందినవారు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలకృష్ణ పక్కన హీరోయిన్ గా భూమిక చావ్లా నటిస్తోంది. క్రిస్మస్ పండుగ నేపథ్యంలో డిసెంబర్ 20 తారీకున సినిమాని విడుదల చేయాలనే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది.

 

ఇటువంటి నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు త్వరలో ప్రారంభించాలని...ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ముందుగా టీజర్ ని, ఆ తరువాత ఒక్కొక్కటిగా సాంగ్స్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేయనుందట సినిమా యూనిట్. ఇకపోతే ఈ సినిమాలో బాలకృష్ణ ఫ్యాన్స్ కోరుకునే మాస్, కమర్షియల్ అంశాలతో పాటు అదిరిపోయే యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఉన్నాయట.

 

ఇక మ్యూజికల్ గా కూడా సినిమా అదిరిపోతుందని, రెండు వరుస ఫ్లాప్స్ తరువాత రాబోతున్న ఈ రూలర్ సినిమా, తప్పకుండా రిలీజ్ తరువాత టాలీవుడ్ బాక్సాఫీస్ ని రూల్ చేయడం ఖాయమని సినిమా యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు సినిమా యూనిట్. అంతేకాకుండా ఈ సినిమాతో మళ్లీ బాలయ్య బాబు తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా ఈ సినిమా అయిన వెంటనే బోయపాటి దర్శకత్వంలో బాలయ్య బాబు సినిమా స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: