నిన్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రముఖులు తెల్లవారుతూనే ఉలిక్కి పడుతూ లేచారు.  ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఇల్లు ఆఫీస్ లతో పాటు వెంకటేష్ నానీల ఇంటి పై ఒకేసారి ఇన్ కమ్ ట్యాక్స్ దాడులు జరగడం ఇండస్ట్రీ ప్రముఖులను కలవార పెట్టింది. కొద్దిరోజుల క్రితం ఏషియన్ సినిమా సంస్థకు చెందిన వ్యక్తుల ఇళ్లు ఆఫీసుల పై ఐటీ దాడులు జరిగాయి. దీనికి కొనసాగింపుగా నిన్న జరిగిన దాడుల మధ్య లింక్ ఏమైనా ఉందా అన్న సందేహాలు కొందరు వ్యక్త పరుస్తున్నారు. 

నిన్నరాత్రి వరకు జరిగిన సోదాల్లో పలుకీలక డాక్యుమెంట్లు అధికారులు పట్టుకున్నట్టు గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. వాస్తవానికి సోదాలు పూర్తయినా ఇప్పటికిప్పుడు వివరాలు బయటకు వచ్చే అస్కారం లేదు.  ఇప్పడు ఈ లింక్ ఇలాగే కొనసాగి మహేష్ అల్లు అర్జున్ లు కార్నర్ అయ్యేలా పరిస్థితులు ఏర్పడుతున్నాయా అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు.

దీనికి కారణం వీరు లేటెస్ట్ గా నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురములో’ మూవీలు ఈ మూవీలు అత్యంత భారీ బడ్జెట్ తో తీయడమే కాకుండా ఈ రెండు మూవీలకు అత్యంత భారీ స్థాయిలో బిజినెస్ జరిగింది అని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ రెండు సినిమాలకు సంబంధించి మహేష్ బన్నీలు ఈ మూవీలను నిర్మిస్తున్న నిర్మాతలతో అధికారికంగా భాగస్వాములుగా కొనసాగుతున్నారు. ఈ రెండు సినిమాల బిజినెస్ కు సంబంధించి కళ్ళు చెదిరే ఫిగర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ బిజినెస్ కు సంబంధించి వస్తున్న లీకులను ఈ మూవీ నిర్మాతలు ఖండించక పోవడంతో ఈ బిజినెస్ ఫిగర్స్ నిజమే అన్న ప్రచారం జరుగుతోంది. 


సాధారణంగా ఇలాంటి భారీ బిజినెస్ కు సంబంధించిన వార్తలు లీక్ అయిన వెంటనే వాటి పై ఇన్ కమ్ టాక్స్ అధికారుల దృష్టి కూడ మళ్ళుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో మహేష్ బన్నీల సినిమాలను తీస్తున్న హారికా హాసినీ దిల్ రాజ్ అనీల్ సుంకరల పై ఐటి అధికారుల దృష్టిపడి కార్నర్ అయితే మహేష్ బన్నీలు కూడ కార్నర్ అయ్యే పరిస్థితులు ఏర్పడ వచ్చు అంటూ కొందరు ఊహాగానాలు చేస్తున్నారు. ఒక విధంగా ఆలోచిస్తే సంక్రాంతి రికార్డులను అన్ని విషయాలలో బ్రేక్ చేయాలని మహేష్ బన్నీల అత్యుత్సాహం వల్ల వీరిద్దరికీ సమస్యలు వచ్చినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: