పవన్ కళ్యాణ్ నిన్న రాత్రి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో పెను దుమారాన్ని సృష్టించి పవన్ పై మళ్ళీ విపరీతమైన సెటైర్లు పడేలా చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియంను నిర్భందం చేసి తెలుగును అశ్రద్ధ చేస్తున్నారు అంటూ పవన్ చేపట్టిన ఉద్యమానికి సంబంధించి నిన్నరాత్రి అమెరికాకు చెందిన ఐసాక్ రిచర్డ్స్ కు సంబంధించిన ఒక వీడియోను షేర్ చేసాడు.

2016 – 2018 సంవత్సరాల మధ్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రిచర్డ్స్ స్పష్టమైన తెలుగు నేర్చుకోవడమే లేకుండా తెలుగు భాష పై ఉన్న మమకారంతో తాను అమెరికాకు తిరిగి వెళ్ళిపోయినా రిచర్డ్స్ తెలుగు పట్ల తన అభిమానాన్ని కొనసాగిస్తున్నాడు. ఇతడు స్పష్టంగా తెలుగు మాట్లాడుతున్న ఒక వీడియోను పవన్ షేర్ చేస్తూ ‘మన నుడి మన నది’ అంటూ తన ట్విటర్ లో కామెంట్ పెట్టాడు.

అయితే ఈ వీడియో షేర్ చేసిన కొన్ని గంటలకే అది వైరల్ గా మారి దాని పై విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ పవన్ ను టార్గెట్ చేస్తూ వస్తున్నాయి. రిచర్డ్స్ ఒక మత ప్రచారకుడనీ తెలుగు రాష్ట్రాలలో క్రైస్తవ మతంలోకి ఎక్కువగా హిందువులను చేర్పించడానికి వారిని ఆకర్షించే నేపధ్యంలో తెలుగు నేర్చుకున్నాడనీ అంతేకాని అతడికి తెలుగు పై ప్రేమలేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

మరికొందరైతే 2019 ఎన్నికల ముందు అమెరికాలోని డల్లాస్ లో జగన్ నిర్వహించిన ఒక మీటింగ్ కు ఐసాక్ రిచర్డ్స్ రావడమే కాకుండా అక్కడ జగన్ ను విపరీతంగా ప్రశంసిస్తూ ఉపన్యాసం చేసిన విషయం పవన్ మర్చిపోయాడా అంటూ మరికొందరు గుర్తు చేస్తున్నారు. మరికొందరైతే ‘అన్నా పవన్ నీభార్య అన్నా స్పష్టమైన తెలుగులో మాట్లాడుతున్న ఒక వీడియోను షేర్ చేయి’ అంటూ జోక్ చేయడమే కాకుండా పవన్ భార్య అన్నాకు తెలుగు పూర్తిగా మాట్లాడటం వస్తే పవన్ చేపడుతున్న ఈ ఇంగ్లీష్ మీడియం వ్యతిరేక ఉద్యమంలో తాము కూడ పాల్గొంటాము అంటూ భరోసా ఇస్తున్నారు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: