రాజమౌళిని జాతీయ స్థాయి దర్శకుల లిస్టులోకి తీసుకువెళ్ళిన మూవీ ‘ఈగ’ ఒక ఈగను హీరోగా మార్చి విలన్ పై పగ తీర్చుకునే కథను గ్రాఫిక్స్ మాయతో రాజమౌళి చూపించిన తీరుకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఆశ్చర్యపోయింది. ఇప్పుడు ఒక తేనెటీగ ఏకంగా రాజమౌళి సమర్థకు సవాల్ విసరడం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది. 

జక్కన్న ‘ఈగ’ ని మించిన తేనెటీగ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో ఇటీవల ఓ తేనెటీగ తెగ చక్కర్లు కొడుతూ తన ఫాలోయర్స్ ను విపరీతంగా పెంచుకుంటూ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈమధ్య కాలంలో ఇన్ స్టా గ్రామ్ ను వాడేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో ఈ ఇన్ స్టాగ్రామ్ లో మనుషులే కాకుండా జంతువులకు కూడా ప్రత్యేకంగా అకౌంట్లు ఉన్నాయి. 

వాటికి ఉండే ఫాలోయింగ్ సినీ తారలకు కూడా ఉండడంలేదు. ఎప్పటికప్పుడు క్రియేటివ్ చిత్రాలు వీడియోలతో ఈఅకౌంట్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈపరిస్థితుల నేపధ్యంలో ఒక తేనెటీగ ఇన్ స్టాగ్రామ్ లో అకౌంట్ ఓపెన్ చేసి తన  ఫాలోవర్లను రోజురోజుకి విపరీతంగా పెంచుకుంటూ పోతుంది. నవ్వు తెప్పించే ఫొటోలతో అందరి మనసు దోచుకుంటోంది. ఏ ఫొటోలో చూసినా ఏదో ఒక పర్యాట ప్రాంతంలో సేద తీరుతూ సెల్ఫీలు తీసుకుంటూ కనిపిస్తుంది. 

అప్పడప్పుడు సూట్కేసులు పట్టుకుని కొన్నిసార్లు తలపై క్యాప్ పెట్టుకుని దర్శనం ఇస్తూ ఉంటుంది ఈ తేనెటీగ. ఇన్ స్టాగ్రామ్లో 'bee_Influencer' పేరుతో ఏడు నెలల క్రితం కొంతమంది ఈ తేనెటీగ ప్రొఫైల్ను మొదలు పెట్టారు. ఈ అకౌంటుకు ఫాలోవర్లు పెరిగితే డబ్బులు వస్తాయని ఆ మొత్తాన్ని తేనెటీగలను పరిరక్షించేందుకు ఉపయోగిస్తామని ఆ తేనెటీగ సృష్టికర్తలు చెపుతున్నారు. దీనితో ఆ అకౌంట్ కి  ఫాలోవర్లు అనూహ్యంగా పెరగడమే కాకుండా ఇప్పటివరకు ఆ అకౌంట్ కి  2.26 లక్షల మంది ఫాలోవర్లు రావడం సంచలనంగా మారింది. ‘కాదేది కవితకు అనర్హం’ అన్నట్లుగా ఈతేనెటీగ తాను టాప్ సెలెబ్రెటీలను డామినేట్ చేస్తాను అని అంటోంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: