తెలుగు చలన చిత్ర సీమకు రెండు కళ్ళుగా చెప్పుకునే నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు   స్వర్ణయుగమే స్రుష్టించారు. ఎంతమంది నటులు వచ్చిన ఎంత టాలెంట్ ఉన్నా కూడా వారిద్దరూ చిరంజీవులు. తెరస్మరణీయులు. ఈ ఇద్దరూ కలసి పండించిన కళా ఖండాలు భావి తరాలకు బంగారమే. ఇదీ మన సినిమా అని గొప్పగా చెప్పుకునే చిత్రాలు ఎన్నో చేసిన ఈ ఇద్దరు నటులను తెలుగు చిత్ర సీమ మరచిపోదు. ఇక ప్రేక్షకుల హ్రుదయాల్లో వారి స్థానం చెక్కుచెదరదు. ఎన్ని తరాలు మారినా రాముడు క్రిష్ణుడు ఎన్టీయారే. దేవదాస్ అంటే ఏయన్నారే.

 

మరి అటువంటి మహానటులను మరింతగా  గుర్తుకు తెచ్చుకునేందుకు ఏపీ చలన చిత్ర అభివ్రుధ్ధి సంస్థ మంచి కార్యక్రమం ఒకటి చేపడుతోంది. విశాఖ మహానగరంలో నందనవనం పేరు మీద తెలుగు సినీ సీమ మహ‌నీయులు, మహానటుల చిత్రపటాలను నెలకొల్పుతున్నారు. దీనికి సంబంధించిన సన్నాహాలు జోరుగా సాగుతున్నాయని చైర్మన్ విజయచందర్ చెప్పారు.  దాంతో ఇకపైన నందనవనంలో ఎన్టీయార్. ఏయన్నార్ లతో పాటు  అలనాటి మహనీయులను ప్రతి ఒక్కరూ ఇకపైన చూడవచ్చునన్నమాట. వారి చిత్రపటాలతో సదా కళ్ళ ముందు కనిపిస్తారన్న మాట. 

 


ఈ నేపధ్యంలో విశాఖలో నందనవనం నెలకొల్పడం అంటే శుభ పరిణామంగా పేర్కొంటున్నారు. ఇక విశాఖ హైదరాబాద్ తరువాత చలన చిత్ర అభివ్రుధ్ధికి రాజధానిగా ఉంటుందని అంతా అంటున్నదే. అయితే ఆచరణలో జగన్ సర్కార్ అడుగులు స్పీడ్ గా  వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. నందనవనం విశాఖలో ఏర్పాటు చేయడం ద్వార విశాఖను గుర్తించినట్లైందని అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఏపీలో చిత్ర సీమను అభివ్రుధ్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్న క్రమంలో విశాఖ సినీ రాజధానిగా మరింతగా వెలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.  చూడాలి మరి. విశాఖ భవిష్యత్తు వెండితెరపై ఎలా సాగుతుందో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: