‘జబర్దస్త్’ కార్యక్రమంలో భారీ మార్పులు జరుగుతున్న నేపధ్యంలో మెగా బ్రదర్ నాగబాబు స్థానాన్ని కమెడియన్ శాస్వితంగా ఆక్రమించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలీ జడ్జిగా వ్యవహరించే కొన్ని ఎపిసోడ్స్ షూటింగ్ కూడ పూర్తి అయిందని తెలుస్తోంది. ఈ మధ్య జరిగిన ఎన్నికలలో నాగబాబు బిజీగా ఉన్నప్పుడు కొన్ని ఎపిసోడ్స్ లో నాగబాబు స్థానంలో అలీని కూర్చోపెట్టి కొన్ని ఎపిసోడ్స్ ప్రసారం చేసారు. 

అయితే ఆ ఎపిసోడ్స్ కు సరైన రేటింగ్స్ రాకపోవడంతో ఎన్నికల తరువాత నాగబాబును మళ్ళీ ‘జబర్దస్త్’ నాగబాబు రోజాల కాంబినేషన్ కు రీ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు అభిప్రాయభేదాల  కారణంగా నాగబాబు ‘జబర్దస్త్’ నుండి వైదొలగడంతో ఇప్పుడు నాగబాబు స్థానాన్ని శాస్వితంగా అలీతో పూరించినట్లు వార్తలు వస్తున్నాయి. అలీ జడ్జిగా వ్యవహరించిన ఈ కార్యక్రమం ఎపిసోడ్స్ అతిత్వరలోనే టెలికాస్ట్ కాబోతున్నాయి. 

దీనికితోడు ఈ కార్యక్రమం నుండి చమ్మక్ చంద్ర వైదొలుగుతున్నట్లు లీకులు వస్తున్నా సుడిగాలి సుధీర్ హైపర్ ఆదిల గురించి క్లారిటీ రావడం లేదు. దీనితో ‘జబర్దస్త్’ షో ఖాళీ అయిపోతుందా అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని ప్రజెంట్ చేస్తున్న మల్లెమాల సంస్థకు ‘జబర్దస్త్’ కోట్లు కురిపించింది. దీనితో రానున్న రోజులలో బుల్లితెర పై ‘జబర్దస్త్’ మ్యానియా తగ్గిపోతుందా అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తుంటే మరి కొందరు మాత్రం అలీ రేంజ్ నాగబాబుకు సరిపోదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. 

నాగబాబు హోస్ట్ చేయబోయే ‘జీ’ తెలుగు టివి ఛానల్ కార్యక్రమం ‘జబర్దస్త్’ స్థాయిని మించేలా డిజైన్ చేయాలని ఈ సంస్థ అనేక వెరైటీ స్కిట్స్ కు శ్రీకారం చుడుతున్నట్లు టాక్. ఈ షోకు సంబంధించి నాగబాబుకు అత్యంత భారీ పారితోషికం ఆఫర్ చేసినట్లు కూడ వార్తలు వస్తున్నాయి. దీనితో ఈ కొత్త కామెడీ బాధ్యతలను తలకెత్తుకుంటున్న నాగబాబుకు ‘జబర్దస్త్’ ను మరిపించే గట్టి పోటీ ఇవ్వగల కార్యక్రమ బాధ్యతలను అంగీకరించినట్లు అర్ధం అవుతుంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: