మహేష్ బాబు..టాలీవుడ్ సూపర్ స్టార్. ఆయన నటనకు ఆడియన్స్ ఫిదా అవుతారు. సెటిల్డ్ పెర్ఫార్మేన్స్ చేయాలంటే మహేష్ అనే అంటారంతా. మెచ్యూరిటీ లెవెల్స్ ఆయన నటనలో కనిపిస్తాయి. ఇక పాత్రలో ఒదిగిపోవడమే కాదు  ఎంత అవసరమో అంతే చేయడం మహేష్ కి అలవాటు. ఓవర్ ప్లే చేసే నటులు మనకు ఎక్కువగా ఉన్నారు. అండర్ ప్లే చేయడం అంటే చాలా కష్టం. మరి మహేష్ మాత్రం అండర్ ప్లేన్ ని కూడా అద్భుతంగా పండిస్తాడు.

 

ఇక సంక్రాంతికి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు అంటూ దూసుకువస్తున్నాడు. ఈ మూవీ పైన అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఇందులో ఉన్న నటులు. సెలెక్షన్ అలాంటిది. దాంతో ప్రతి అప్ డేట్ ఆసక్తిని పెంచేస్తోంది. ఇక మహేష్ బాబు ఈ మూవీలో మేజర్ గా ఫస్ట్ టైం ప్లే చేయడం కూడా ఇంటెరెస్టింగ్ పాయింట్. అదే విధంగా హీరోయిన్ రష్మిక మందన కూడా మహేష్ కి పెయిర్ గా ఎలా ఉంటుందో అన్నది మరో ఆసక్తికర అంశం.

 

ఇక ఈ మూవీలో దాదాపు 14 ఏళ్ళ తరువాత విజయశాంతి నటిస్తోంది. ఆమె నాయుడమ్మ సినిమా తరువాత ముఖానికి మేకప్ వేసుకోలేదు. ఇదిలా ఉండగా ఇందులో దిగ్గజాల్లాంటి నటులే కాదు.  మొత్తం టెక్నికల్ టీం కూడా టాప్ రేంజిలో ఉంది. ఇక సరిలేరు నీకెవ్వరు టీజర్ ని రేపు విడుదల చేస్తున్నారు. ఈ టీజర్ ఎలా ఉంటుందా అన్న టెన్షన్ ఇటు ఫ్యాన్స్ తో పాటు అడు సాధారణ ఆడియన్స్ లోనూ పెరిగిపోతోంది.

 

నిజానికి టీజర్ల విషయంలోనూ, ప్రమోషన్ల విషయంలోనూ మరో సంక్రాంతి బొమ్మ అల వైకుంఠపురంలో పై చేయి సాధించింది. ఈ మూవీ సాంగ్ కూడా అదుర్స్ అన్న రేంజిలో వ్యూస్ సంపాదించి రికార్డ్ క్రియేట్ చేశాయి. మరి సరిలేరు నీకెవ్వరు మూవీ విషయానికి వస్తే పోటీ మాత్రం కచ్చితంగా ఫ్యాన్స్ లో ఉంది. మా హీరో టీజర్ అదిరిపోవడం ఖాయమని అపుడే లెక్కెలేసులుంటున్నారు. మరి ఇంతలా హై ఎక్స్ పెక్టేషన్లు పెంచేసిన  సరిలేరు నీకెవ్వరు మరి కొద్ది గంటల్లో టీజర్ ద్వారా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: