టెక్నాలజీ పెరుగుతుంది మహిళల ఆలోచనా తీరులో మార్పు వస్తుంది కానీ... రుతుస్రావం విషయంలో మహిళలు  ఇప్పటికే ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఈ విషయంలో ఎలాంటి సమస్య వచ్చినా ఎవరికీ చెప్పకుండా తమలోనే  దాచుకుంటారు. రుతుస్రావం అనేది అదో పెద్ద నిషేధం అన్నట్లుగా నామోషీగా ఫీల్ అవుతుంటారు. మహిళలు  పీరియడ్స్ లో ఎలాంటి సమస్య వచ్చినా ఎవరికీ చెప్పకపోవడం వల్ల ఎన్నో సమస్యలను ఫేస్ చేస్తున్నారు మహిళలు. పీరియడ్స్ లో ఏర్పడిన సమస్యల కారణంగా గర్భధారణకు కూడా ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే తాజాగా మెగా కోడలు అపోలో లైఫ్ సంస్థ అధినేత ఉపాసన మహిళల రుతుస్రావం  పై కీలక వ్యాఖ్యలు చేశారు. రుతుస్రావం విషయంలో మహిళలు ఎందుకు ఇబ్బంది పడతారో  తనకు అర్థం కాదు అంటూ ఉపాసన తెలిపారు. 

 

 

 

 ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా  ఉంటూ పలు సామాజిక సమస్యల పైనే  కాకుండా తన ఫ్యామిలీ అప్డేట్స్  కూడా పోస్ట్ చేస్తూ ఉపాసన అందరిని అలరిస్తుంది. అంతేకాకుండా తన అభిరుచులు హెల్త్ టిప్స్ ను కూడా తన అభిమానులతో పంచుకుంటూ కొణిదెల వారి కోడలు ఉపాసన. అయితే తాజాగా మహిళల్లో రుతుస్రావం పై తన అభిప్రాయాన్ని వెల్లడించారు మెగా కోడలు. సాధారణంగా రుతుస్రావం అనగానే చాలామంది మహిళలు ఈ విషయం గురించి మాట్లాడేటప్పుడు భయపడుతున్నారని ఉపాసన  తెలిపారు. రుతుక్రమం అనేది  నిషిద్ధ పదం అన్నట్లుగా మహిళలు  దీని గురించి మాట్లాడడానికి నామోషీగా ఫీల్ అవుతారని ఉపాసన అన్నారు. అయితే పీరియడ్స్ రాగానే  ఎవరికీ కనిపించకుండా ఏం చెప్పకుండా మహిళలు ఇబ్బందులు పడతారు  అంటూ ఆమె తెలిపారు.

 

 

 

 మహిళలు రుతుస్రావం విషయంలో ఇలా చేయడం ఎందుకంటూ మెగా కోడలు ఉపాసన మహిళలను ప్రశ్నించారు. రుతుక్రమం అనేది మహిళల ఆరోగ్యానికి గర్భధారణకు మంచిదేనని ఆమె గుర్తు చేశారు.చాలా  మంది మహిళలు ఋతుక్రమం గురించి ఎందుకు మాట్లాడడానికి భయపడుతున్నారు తనకు అర్థం కాదని తెలిపారు. ఋతు క్రమాన్ని సీక్రెట్ గా ఉంచేందుకు చాలా మంది మహిళలు ప్రయత్నిస్తారని తెలిపారు. మహిళలు రుతుక్రమం ఏదో చెడు అన్నట్లుగా భావిస్తారని... మలబద్ధకం గ్యాస్ లాంటి వాటి గురించి బహిరంగంగా మాట్లాడుతున్న మహిళలు రుతుక్రమం గురించి మాత్రం భయం లేకుండా ఎందుకు మాట్లాడలేకపోతున్నారూ  అంటూ ప్రశ్నించారు. మహిళల్లో రుతుక్రమం అనేది సహజమైనది అని అది  ఆరోగ్యానికి గర్భం దాల్చేందుకు కూడా ఉపయోగపడేది అంటూ ఉపాసన వ్యాఖ్యానించారు. మహిళలు రుతుక్రమం గురించి మాట్లాడగలిగితేనే  దానికి తగ్గ సొల్యూషన్ దొరుకుతుంది అంటూ  సూచించారు మెగా కోడలు ఉపాసన.

మరింత సమాచారం తెలుసుకోండి: