‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో జూనియర్ పక్కన హీరోయిన్ గా నటించే ఒలివియా మోరిస్ ఎంపిక విషయంలో రాజమౌళి కొంత వరకు రాజీ పడినట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి రాజమౌళికి ఈ మూవీలో జూనియర్ హీరోయిన్ గా ఎమ్మా రాబర్డ్స్ ను ఎంపిక చేద్దామని రాజమౌళి ఎన్నో ప్రయత్నాలు చేయడమే కాకుండా స్వయంగా జక్కన్న అమెరికాకు వెళ్లి ఆమెతో మాట్లాడటం కూడ జరిగింది. 

‘వైల్డ్ లైఫ్' ‘నెర్వ్' ‘వలంటైన్స్ డే' ‘అడల్ట్ వరల్డ్' లాంటి అనేక సినిమాలలో నటించిన ఈమెకు హాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉండటంతో ఆమెను ఒప్పించడానికి భారీ పారితోషికాన్ని రాజమౌళి ఆఫర్ చేసినా ఈ పాత్ర చేయడం కోసం ఎక్కువ రోజుల కాల్ షీట్స్ ఇవ్వడానికి ఆమె తిరస్కరించడంతో మరో గత్యంతరం లేక రాజమౌళి ఎమ్మా రాబర్ట్స్‌ ను తప్పించి ఒలీవియా మోరిస్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. 

అయితే ఈ మూవీలో నటించడానికి ఒలీవియా మోరిస్ అత్యంత భారీ పారితోషికాన్ని అడిగిందనీ ఈ మూవీలో నటిస్తున్న అలియా భట్ పారితోషికం కంటే ఆమెకు భారీ పారితోషికంతో పాటు ఆమె లండన్ నుండి తన మేకప్ మెన్ హెయిర్ డ్రసర్ తో సహా ఇండియా రావడానికి ఖర్చులు నిమిత్తమే భారీ మొత్తం డిమాండ్ చేయడమే కాకుండా ఆమెకు ఆమె టీమ్ కు సంబంధించి ప్రత్యేక వసతి ఏర్పాట్లు రాజమౌళి నుండి కోరినట్లు టాక్. 

ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన జెన్నీఫర్‌ పాత్రలో పరిచయం అవుతున్న ఒలీవియా మోరిస్‌ లండన్‌ కు చెందిన థియేటర్ ఆర్టిస్ట్. అంతేకాదు కొన్ని టీవీ సిరీస్‌లలో కూడా నటించింది. అక్కడ ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది. ఎమోషన్స్ ఎక్స్‌ప్రెషన్స్ పండించడంలో ఒలివియా దిట్ట అట. దీనికితోడు అందం కూడా కలిగిన నటి కావడంతో తక్కువ వయసులోనే ఎక్కువ పాపులారిటి ఆమె సొంతం. దీనితో పాజిటివ్ లక్షణాలు ఆమెకు ఉండటంతో ఆమె అడిగిన డిమాండ్స్ అన్నీ రాజమౌళి అంగీకరించినట్లు తెలుస్తోంది..  

మరింత సమాచారం తెలుసుకోండి: