తాజాగా మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా తెరకెక్కిన చిత్రం సైరా నరసింహారెడ్డి. చిరంజీవి సినీ కెరియర్ లోనే మొదటి చారిత్రాత్మక చిత్రంగా ఈ సినిమా తెరకెక్కింది. అంతే కాకుండా భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొనగా  సినిమా విడుదలై పలు చోట్ల మాత్రం నిరాశ పరిచింది అని చెప్పాలి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి 50 రోజుల కలెక్షన్స్ విడుదల చేసింది  చిత్ర బృందం. సురేందర్రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమా 50 రోజుల కలెక్షన్స్ చూస్తుంటే చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ కాలేదు. అయితే సైరా నరసింహారెడ్డి సినిమా తెలుగు రాష్ట్రాల్లో 106 కోట్ల మార్కును అందుకున్నప్పటికీ

.. మిగతా చోట్ల మాత్రం బ్రేక్ ఈవెన్  చేరుకోలేకపోయింది. మొత్తంగా 240 కోట్ల గ్రాస్ 143 కోట్ల షేర్లను ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసింది చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమా. అయితే ఒక్క తెలుగులో తప్ప మిగతా అన్ని చోట్ల  చూసుకుంటే సైరా నరసింహారెడ్డి సినిమా నిరాశనే మిగిల్చిందని చెప్పాలి. 

 

 

 

 ఎందుకంటే ఈ చిత్రాన్ని దాదాపు 188 కోట్లకు పైగానే నిర్మాతలు అమ్మినట్లు సమాచారం. అయితే తెలుగులో మాత్రమే సైరా నరసింహారెడ్డి మంచి వసూళ్లను రాబట్టడం గమనార్హం. ఒకట్రెండు చోట్ల మాత్రమే సైరా నరసింహారెడ్డి సినిమా బ్రేక్ ఈవెన్ దాటి లాభాల బాటలో నడిచింది. మిగిలిన చోట్ల మాత్రం సైరాకు కష్టాలు తప్పలేదు. అయితే సైరా ఓవర్సీస్ కలెక్షన్స్  మరీ దారుణంగా ఉన్నాయి. అక్కడ కేవలం 2.5 మిలియన్ల దగ్గరే ఆగిపోయింది మెగాస్టార్ సైరా నర్సింహారెడ్డి చిత్రం. ఇక హిందీలో కూడా కనీస వసూళ్లను  రాబట్టలేకపోయింది సైరా . మొత్తం కలిపితే ఎనిమిది కోట్ల వసూళ్లు  కూడా తీసుకు రాలేదు. మొత్తంగా ఈ సినిమా 33 థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. 

 

 

 

 ఇదిలా ఉంటే ఈ విషయంలో  మెగాస్టార్ తమ్ముడు నాగబాబు తనయుడు మెగా ప్రిన్స్  వరుణ్ తేజ్... మెగాస్టార్ చిరంజీవి ని వెనక్కి నెట్టారని చెప్పాలి. వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఎఫ్ 2 ఈ సంవత్సరం సంక్రాంతి బరిలో నిలిచి మంచి విజయం అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఎఫ్ 2 చిత్రం 65 సెంటర్లలో 50 ఫుల్ రన్  పూర్తి చేసుకుంది. దీంతో 2019 లో విడుదలైన సినిమాల్లో రెండవ స్థానంలో నిలిచింది. అయితే అంతకు ముందుగా మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా 110 సెంటర్లలో ప్లేస్ లలో 50 రోజులు పూర్తి చేసుకుని మొదటి ప్లేస్ లో నిలిచింది.ఇక సైరా 33 సెంటర్లలో 50 రోజులు పూర్తిచేసుకుని 3 ప్లేస్లో ఉండగా...  ఆ తర్వాత సమంత నాగచైతన్య కు జోడిగా నటించిన మజిలీ  చిత్రం 25 సెంటర్లలో అర్థశతదినోత్సవం పూర్తి చేసుకుంది. మొత్తంగా చేసుకుంటే 50 రోజులు పూర్తయ్యే సరికి ఎక్కువ సెంటర్లో ఆడిన సినిమా విషయంలో మెగాస్టార్ చిరంజీవి ని వరుణ్ తేజ్ కి వెనక్కి నెట్టి  ముందుకు వచ్చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: