తెలుగులో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరక్కేక్కిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్.. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. భారీ పిరియాడికల్ డ్రామాగా తెరక్కేకుతున్న ఈ సినిమా దాదాపు 70 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. కాగా, ఎన్టీఆర్ పాత్రకు హీరోయిన్ దొరికిందట. 

 

ఇది ఇలా ఉండగా హాలీవుడ్ హీరోయిన్ 'ఒలివియా మోరిస్ ఎన్టీఆర్ కి జోడిగా నటిస్తున్నట్లు సమాచారం. ఇక విలన్ పాత్రలో అలిసన్ డూడీ, రే స్టీవెన్ స‌న్ కనిపించనున్నారు. తాజాగా ఈ విషయాన్నీ బుధవారం చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే వారందరు ఈ చిత్ర రెగ్యులర్ షూట్ కు హాజరు కానున్నారు. వచ్చే ఏడాది జులై 30 వ తేదీన రిలీజ్ కానుంది. ఎలా ఏ ఇద్దరు హీరోలకు హిట్ నిస్తుందో చూడాలి..

 

ఇది. డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది జులై 30న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కానీ, దీనిపై ప్రేక్షకుల్లో బోలెడన్ని అనుమానాలు.‘ఎ వ్యూ టు కిల్‌’, ‘ఇండియానా జోన్స్‌’, ‘లాస్ట్ క్రూసేడ్‌’ వంటి చిత్రాల్లో ఐరిష్ న‌టి అలిస‌న్ డూడీ న‌టించారు. అలాగే ‘థోర్‌’, ‘కింగ్ అర్థర్‌’ చిత్రాలు సహా ప‌లు పాపుల‌ర్ టీవీ షోస్‌లో రే స్టీవెన్‌స‌న్ న‌టించారు. వీరు ముగ్గురు త్వరలో rrr షూటింగ్‌లో పాల్గొంటారు. ఈ విషయాలను వెల్లడిస్తూ చిత్ర యూనిట్ విడుదల చేసిన ప్రకటనలో ‘‘అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి 2020లో 10 భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అని పేర్కొన్నారు.

 

షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా  విడుదల తేదీని మాత్రం స్పష్టంగా రాయలేదు. అంటే, అనుకున్న తేదీ జులై 30న ఈ సినిమా విడుదల కాదా అనే అనుమానం చాలా మందిలో మొదలైంది. మరి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా, ఈ చిత్రంలో రామ్‌ చ‌ర‌ణ్ జోడిగా ఆలియా భ‌ట్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అలాగే, అజయ్ దేవగణ్, సముద్రఖని కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా విడుదల ఇప్పుడా అన్నది తెలియడం లేదు..

మరింత సమాచారం తెలుసుకోండి: