క్రేజీ హీరో విజయ్ దేవరకొండకు ఇప్పుడు ఒక భారీ బ్లాక్ బస్తర్ హిట్ కావాలి. దీనితో పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో చేయబోతున్న మూవీకి ఎన్ని డేట్స్ కావాలి అంటే అన్ని డేట్స్ ఇస్తానని విజయ్ పూరీకి చెపుతున్నట్లు సమాచారం. ఈ మూవీ వచ్చే జనవరి నుండి ప్రారంభం కాబోయే పరిస్థితులలో ఈ మూవీ గురించి ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. 

ఈ మూవీలో విజయ్ పాత్రకు నత్తి ఉంటుందని సమాచారం. వాస్తవానికి ఇలాంటి నత్తి మ్యానరిజమ్ ఉన్న పాత్రను గతంలో పూరీ జూనియర్ ను దృష్టిలో పెట్టుకుని క్రియేట్ చేసాడు. అయితే పూరీ చెప్పిన ఆ కథ నచ్చకపోయినా జూనియర్ పూరీ తనకు చెప్పిన మ్యానరిజమ్ ను యధాతదంగా అనుసరించి ‘జై లవ కుశ’ మూవీలో చూపించాడు. 

ఇప్పుడు మళ్ళీ విజయ్ పాత్రకు పూరీ అలాంటి నత్తిని ప్రయోగిస్తూ ఉండటంతో ప్రస్తుతం విజయ్ నత్తితో బాధపడే కొంతమంది బాడీ లాంగ్వేజ్ ని పరిశీలించే పనిలో బిజీగా ఉన్నట్లు టాక్. ఇప్పటి వరకు విజయ్ ని లిప్ లాక్ సీన్స్ లో నటిస్తూ హీరోయిన్ ను పడేసే పాత్రల ద్వారా యూత్ కు బాగా కనెక్ట్ అయిన విజయ్ దేవరకొండ డైలాగ్ డెలివరీలో ఇలాంటి ప్రయోగాలు కనిపిస్తే ఎంత వరకు ప్రేక్షకులు అభిమానులు హర్షిస్తారు అన్న సందేహాలు కూడ అందరికీ వస్తున్నాయి. 

ప్రస్తుతం ఏది ఎలా ఉన్నా ఎట్టి పరిస్థితులలో హిట్ కావాలి అన్న ఒత్తిడి ఎదుర్కొంటోన్న విజయ్‌ దేవరకొండ మిగతా సినిమాలని పక్కన పెట్టి మరీ ‘ఫైటర్‌’ మూవీలో నత్తి తో కనిపించే బాక్సర్ గా రాణించడానికి గట్టి కృషి చేస్తున్నాడు. అయితే విజయ్ దేవరకొండకు సూపర్ హిట్ ఇమేజ్ ఇచ్చిన ‘గీత గోవిందం’ స్థాయిని మించి ఈ మూవీలో కథ కనపడకపోతే ప్రేక్షకులు నిరాశ చెందే ఆస్కారం ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: