నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా వస్తున్న రూలర్ సినిమా డిసెంబర్ 20న విడుదల కానుంది. బాలయ్య పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్లుగా సొనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య లుక్ లో కొత్తగా కనిపిస్తున్నాడు. బాలయ్య అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాపై ఫిల్మ్ నగర్ లో ఆసక్తికర వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

 

 

సినిమా నుంచి మెయిన్ హీరోయిన్ సొనాల్ చౌహాన్ తప్పకుందని ఆ వార్త సారాంశం. ఇప్పటికే బాలయ్య – సొనాల్ పై పాటలు కూడా తీశారు. షూటింగ్ కూడా దాదాపు పూర్తికావొచ్చింది. మేకర్స్ తో సొనాల్ కు అభిప్రాయభేదాలు వచ్చి ఈ సినిమా నుంచి తప్పుకుందని అంటున్నారు. ఇదే జరిగుంటే ఈసరికి కొత్త హీరోయిన్ పేరును యూనిట్ ప్రకటించేది. కానీ అటువంటిదేమీ ఇంత వరకూ జరగలేదు. పైగా సినిమా కూడా డిసెంబర్ 20 నుంచి 28కి పోస్ట్ పోన్ అయిందనే వార్త కూడా రౌండ్ అవుతోంది. మరి ఈ రూమర్స్ ఎందుకు స్ప్రెడ్ అవుతున్నాయో.. ఇందులో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.

 

 

ఈ సినిమాపై బాలయ్య అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. బాలయ్యసినిమా కోసం దాదాపు ఎనిమిది కేజీలు బరువు తగ్గి కొత్త లుక్ లో ఉన్నాడు. సినిమాలో బాలయ్య షర్ట్ తీసి కనిపించే మాస్ సీన్ కూడా ఉందని సమాచారం. సెకండ్ హీరోయిన్ గా చేస్తున్న వేదికతో బాలయ్య లిప్ లాక్ ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి. సినిమా డెఫినెట్ గా మాస్ అలరిస్తుందని, ప్రేక్షకులకు నచ్చుతుందని యూనిట్ అంటోంది. ఈ వార్తలన్నీ ప్రస్తుతానికి గాసిప్సే అయినా వీటన్నింటిపై సినిమా యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: