టాలీవుడ్ లోకి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చిరుత సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్.  మొదటి సినిమా పెద్దగా గుర్తింపు తీసుకు రాకపోయినా.. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ‘మగధీర’ మూవీతో ఎవర్ గ్రీన్ హిట్ అందుకున్నాడు.  ఈ మూవీ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రికార్డుల మోత మోగించింది.  ఆ తర్వాత రామ్ చరణ్ నటించిన దాదాపు అన్ని సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి.  గత ఏడాది సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ తో మరో బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాదు రెండు వందల కోట్ల క్లబ్ లో చేరాడు.  

 

మరోసార రాజమౌళి తో ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో నటిస్తున్నారు రామ్ చరణ్.  అయితే రామ్ చరణ్ అప్పుడప్పుడు చిన్న పిల్లలతో తెగ ఎంజాయ్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. చిన్న పిల్లల్ని ఆటపట్టించడమన్నా.. వాళ్లతో సరదాగా ముచ్చట్లు పెట్టడమన్నా ఎంతో ఇష్టం. ‘రంగస్థలం’ సినిమా షూటింగ్ సమయంలో కొంత మంది పిల్లలతో సరదాగా గడిపిన వీడియో అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. తాజాగా ఓ చిన్న పిల్లాడితో గొడవ పడటం ఇప్పుడు వైరల్ గా మారింది.  ఇంతకీ అసలు విషయం ఏంటంటే తాను చేసే జిమ్‌లో ఒక చిన్న పిల్లాడితో సరదాగా వాదన పెట్టుకున్నారు చరణ్. 

 

 రీసెంట్‌గా నా సినిమా ఏం చూశావ్  అని ఆ పిల్లాడిని రామ్ చరణ్ అడిగారు. వెంటే ఆ పిల్లాడు ధృవ అని చెప్పాడు..వెంటనే చరణ్.. ఆ సినిమాలో ఉన్నది నేను కాదు, మీ నాన్న అని అన్నారు. కానీ, ఆ పిల్లాడు మాత్రం మీరే అంటూ వాదించాడు. ఆ పిల్లాడు రామ్ చరణ్ వెలు చూపించుకుంటూ నువ్వే..నువ్వే అంటూ తెగ గొడవ పడటం చూస్తుంటే నిజంగా రామ్ చరణ్ లో ఇంకా పిల్లాడి మనస్థత్వం పోలేదు అనిపిస్తుంది. మొత్తానికి ఆ బాలుడిని దగ్గరకు తీసుకున్న చరణ్.. అందరినీ జిమ్‌కు వెళ్లమని పిల్లాడితో చెప్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: