బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ పేరు తెలియని వారుండరూ. ఎందుకంటే 1995 లో వచ్చిన దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే చిత్రం షారుక్ పేరును ప్రతి యువతకు పరిచయం చేసింది.  ఆ తర్వాత దిల్ తో పాగల్ హై, కుచ్ కుచ్ హోతా హై, మొహొబ్బతే, కభీ ఖుషీ కభీ గమ్ సినిమాలతో హీరోగా ఉన్నత శిఖరాలందుకున్నారు షారుఖ్. అంతే కాకుండా  దేవదాస్, స్వదేశ్, చక్ దే! ఇండియా, మై నేమ్ ఈజ్ ఖాన్ సినిమాల్లో ఆయన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు లభించాయి.

 

 

ఇలా ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాధించుకున్నాడు. ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న షారూఖ్ ను ఇటీవల కాలంలో వరుసగా ఫ్లాపులు పలకరిస్తున్నాయి. ఇకపోతే షారుఖ్ చివ‌రి చిత్రం “జీరో” తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. ఇలాంటి పరిస్దితుల్లో షారూఖ్ చేతిలో ఒక్క సినిమా కూడా లేకుండా ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు..

 

 

అయితే దేశ విదేశాల‌లో షారూఖ్ ఖాన్‌కి విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. అందువల్ల ఈ హీరో సినిమా హిట్‌, ఫ్లాప్ అనే సంబంధం లేకుండా అభిమానిస్తుంటారు. ఇక షారుఖ్ ఖాన్, కరణ్ జోహార్ మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. అంతే కాకుండా ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్స్ వచ్చాయి.

 

 

అవి ‘కుచ్ కుచ్ హోతా హై’, ‘కబీ ఖుష్ కబీ గమ్’, ‘కబీ అల్వీదా నా కహెనా’, ‘మైనేమ్ ఈజ్ ఖాన్’ వంటి సినిమాలతో వరుసగా హిట్స్ కొడుతూ, బ్లాక్ బస్టర్ కాంబినేషన్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇదే కాకుండా కరణ్ నిర్మించిన పలు సినిమాల్లో కూడా షారుఖ్ నటించారు. ఇక వీరి స్నేహానికి గుర్తుగా కరణ్ జోహార్ తన మిత్రుడు షారుఖ్‌కు ఓ అదిరిపోయే గిప్ట్ గా ప్రత్యేకంగా తయారు చేసిన ఓ పాపులర్ బ్రాండ్‌కు చెందిన జాకెట్ ను బహుమతిగా ఇచ్చాడట.

 

 

ఈ విషయాన్ని షారుఖ్ తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. తన అభిమానులతో పంచుకున్నారు. ఆయన తన పోస్ట్‌లో రాస్తూ.. ఆ గిఫ్ట్ ఇచ్చినందుకు కరణ్‌కు ధన్యవాదాలు తెలియజేస్తూ.. కరణ్ ఫ్యాషన్ సెన్స్‌‌ను అందుకోవడం కష్టం అని తెలిపారు. కాగా ఈ జాకెట్ ఖరీదు దాదాపుగా ఒక లక్షా పాతిక వేలకు పైగా ఉండనుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: